For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వరుణ్ తేజ్ ను నిజంగానే పెళ్లి చేసుకుంటావా.. నెటిజన్ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి షాకింగ్ రియాక్షన్

  |

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాటి.. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపును అందుకున్న లావణ్య. ఆ తర్వాత వేగంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. ప్రస్తుతం కొన్ని అపజయాలు వెంటాడుతున్నప్పటికే ఈ బ్యూటీ వీలైనంతవరకు మంచి సినిమాలను చేసే విధంగా అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల కాలంలో లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగా హీరోతో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఒక టాక్ అయితే వచ్చింది. ఇక ఫైనల్ గా ఇటీవల లావణ్య త్రిపాటి ఎవరూ ఊహించని విధంగా ఒక క్లారిటీ ఇచ్చింది.

  Recommended Video

  Ghani Teaser లో Ram Charan Mass | టాలీవుడ్ డిసెంబర్ రిలీజులు || Filmibeat Telugu
   మొదటి సినిమాతోనే..

  మొదటి సినిమాతోనే..

  హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది లావణ్య త్రిపాటి అంతకంటే ముందు కొన్ని కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా మంచి సినిమాతో తెలుగులోకి రావాలి అని చాలా కాలం ఎదురు చూసింది. మోడలింగ్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్న లావణ్య త్రిపాటి మొత్తానికి అందాల రాక్షసి సినిమా తెలుగు జనాలకు బాగానే దగ్గర అయింది.

  అవకాశాలు తగ్గాయి

  అవకాశాలు తగ్గాయి

  లావణ్య త్రిపాటి ఆ మధ్య కాలంలో వరుస విజయాలను కూడా అందుకుంది. ఆమె చేసిన బలే బలే మగాడివోయ్, నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇటీవల కొన్ని సినిమాలు వరసగా ఫెయిల్యూర్ అవడంతో లావణ్య త్రిపాఠి కి అవకాశాలు కూడా చాలావరకు తగ్గాయి.

  హీరోతో లవ్ ట్రాక్?

  హీరోతో లవ్ ట్రాక్?

  అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా లావణ్య ఒక హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ హీరో మరెవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ అని కూడా గట్టిగా టాక్ అయితే వచ్చింది. ఇద్దరు కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ లో కూడా తరచుగా పాల్గొంటున్నారు అని ప్రేమలో కూడా ఉన్నట్లు మీడియాల లో స్టోరీ లో వైరల్ అయ్యాయి.

  మెగా ఫ్యామిలీలో లావణ్య

  మెగా ఫ్యామిలీలో లావణ్య

  అయితే మీడియాలో రూమర్లు కూడా ఎంత వైరల్ అయినా మొదట వాటిపై పెద్దగా స్పందించలేదు. ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ మెగా పార్టీలలో కూడా ఆమెను ప్రత్యేకంగా తీసుకురావడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నిహారిక పెళ్లికి కూడా లావణ్య త్రిపాటి హాజరయ్యింది. లావణ్య త్రిపాటిని తరచుగా ఎందుకు తీసుకు వస్తున్నాడు అనే విషయంలో అనేక రకాల ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి.

  స్పందించిన లావణ్య

  స్పందించిన లావణ్య

  అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకోబోతున్నారు అనే ఒక ప్రశ్నకు ఆశ్చర్యపరిచే విధంగా రియాక్షన్ ఇచ్చింది. ఇంతవరకు నా పెళ్లి ఎవరితో అనేది నాకే తెలియదు.. నా గురించి నాకు తెలియని విషయం వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో అర్థం కావడం లేదు' అంటూ వివరణ ఇచ్చింది.

  ప్రేమలో ఉన్నారా

  ప్రేమలో ఉన్నారా

  ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా అనే ప్రశ్నకు కూడా లావణ్య త్రిపాటి స్పందించకుండా లైవ్ లో మౌనంగానే ఉండిపోయింది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ సినిమా లో ఈ జోడి మొదటిసారి నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది అంతేకాకుండా ఆ తర్వాత చేసిన అంతరిక్షం సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే వీరి మధ్య స్నేహం మాత్రం పెరిగింది అని టాక్ వచ్చింది.

  నిహారికతో స్నేహం..

  నిహారికతో స్నేహం..

  అంతేకాకుండా లావణ్య త్రిపాటి, వరుణ్ సోదరి నిహారిక కొణిదెల కూడా మంచి స్నేహితులు. ఇద్దరు కూడా తరచుగా కలుస్తూ ఉంటారు. నిహారిక పెళ్లి లో కూడా లావణ్యత్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు కూడా పాల్గొంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయంలో ఎన్ని కథనాలు వస్తున్నా కూడా వాటిని లావణ్య పెద్దగా పట్టించుకోవడం లేదు. వరుణ్ కూడా ఆ రూమర్స్ ను చాలా లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Heroine lavanya tripathi indirect clarification on love marriage gossips..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X