బ్రాలో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. ఎద అందాలు కనిపించేలా పోజులు.. వదినమ్మ అంటూ!
టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. యూపీకి చెందిన ఈ బ్యూటి సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసిన లావణ్య త్రిపాఠీకి ఆ మధ్య విజయాలు వరించలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా దూసుకుపోతున్న లావణ్య ఇటీవల ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా హాట్ షోతో అదరగొడుతోన్న ఈ సుందరి తాజాగా బ్రాలో కనిపించి షాక్ ఇచ్చింది. ఆ ఫొటోలపై లుక్కేస్తే..
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్:బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తారాఖండ్ లోని డెహ్రడూన్ లో పెరిగింది. లావణ్య తండ్రి హైకోర్టు న్యాయవాది కాగా.. తల్లి ఉపాధ్యాయినిగా పదవి విరమణ చేశారు. లావణ్య త్రిపాఠికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. మార్షల్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి ముంబైకి వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించింది.

మిస్ ఉత్తరాఖండ్ టైటిల్:చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో రాణించాలని కలలు కన్న లావణ్య త్రిపాఠి తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో, టీవీ కార్యాక్రమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం సైతం గెలుచుకుంది సొట్ట బుగ్గల సుందరి.

అతి తక్కువ సమయంలో:మోడలింగ్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా మారిన తొలి సినిమా అందాల రాక్షసితో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అయింది లావణ్య త్రిపాఠి. రాహుల్ రవీంద్ర, నవీన్ చంద్రతో కలిసి నటించిన ఈ సినిమాలో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది.

వరుస హిట్లు:నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటూ తన క్యూట్‌నెస్‌తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా మంచి హిట్ కొట్టిన తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

అనేక ప్లాపులు:సొట్ట బుగ్గల బ్యూటి లావణ్య తర్వాత చేసిన లచ్చిందేవికి ఓ లెక్కుంది, రాధ, ఇంటలిజెంట్, యుద్ధం శరణం, మిస్టర్, అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ1 ఏక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే వంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. ఇటీవల పులి మేక అనే వెబ్ సిరీసుతో ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చింది ఈ సొగసరి.

మెగా ప్రిన్స్ తో డేటింగ్:ఇక ఆ మధ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ ఎక్కువైన విషయం తెలిసిందే. లావణ్య ఇంటికి వెళ్లి మరి వరుణ్ తేజ్ ప్రపోజ్ చేశాడని ఒక టాక్ వినిపించింది. అవన్నింటిని వారు కొట్టిపారేసిన ఈ నెల 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బ్రాలో లావణ్య:ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫొటోలతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది గ్లామరస్ భామ లావణ్య త్రిపాఠి. తాజాగా వైట్ కలర్ బ్రాలో దర్శనం ఇచ్చిన ఈ సుందరి ఎద అందాలను ఆరబోసింది. సిట్టింగ్ ఇన్ ద సన్ రేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫొటోల్లో స్మైల్ తో ఆకర్షిస్తోంది లావణ్య. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ కాగా.. వదినమ్మ, మెగా ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











