twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుల వివాదంలో లావణ్య త్రిపాఠి.. ధైర్యంగా ట్వీట్ చేసి..

    |

    అందాల తార లావణ్య త్రిపాఠి వివాదంలో చిక్కుకొన్నారు. కులం పేరుతో చేసిన ట్వీట్ అత్యంత వివాదంగా మారింది. దాంతో ఆమె చేసిన ట్వీట్ వెనుక ఏమిటి అంతరార్థం అనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఓ వైపు చర్చ జరుగుతుండగానే వివాదాస్పద ట్వీట్‌ను డిలీట్ చేయడం మరింత చర్చగా మారింది. అయితే వివరాల్లోకి వెళితే..

     కులాన్ని ఉద్దేశించి

    కులాన్ని ఉద్దేశించి

    అందం, అభినయంతో మెప్పిస్తున్న లావణ్య త్రిపాఠి బ్రహ్మణ కులానికి చెందిన వారట. అయితే అలాంటి బ్రహ్మణులను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేయడం అత్యంత చర్చనీయాంశమైంది. బ్రహ్మణుల ఆలోచనా తీరు సరి కాదు అనే విషయంపై ఆమె కామెంట్ చేయడం ఓ వర్గం నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

    అధికులమనే భావనపై లావణ్య

    అధికులమనే భావనపై లావణ్య

    లావణ్య త్రిపాఠి ట్వీట్ ప్రకారం.. బ్రహ్మణ కులానికి చెందిన వ్యక్తిగా కొన్ని విషయాలు నాకు అర్థం కావు. కులాన్ని బట్టే ఆధిక్యత ఉంటుందనే ఆలోచన నాకు అసలే బోధపడదు. ఓ వ్యక్తి చేష్టలు, పనులు వల్ల అధికుడా? ఆధిపత్యం తక్కువ ఉందా అనేది తెలుస్తుంది. అంతేకాని కులాన్ని బట్టి అధికులమనే హోదాను నిర్ధారించడం తప్పు అనే విధంగా ట్వీట్ చేశారు.

     ట్వీట్ డిలీట్ చేసిన లావణ్య త్రిపాఠి

    ట్వీట్ డిలీట్ చేసిన లావణ్య త్రిపాఠి

    హీరోయిన్ లావణ్య త్రిపాఠి ట్వీట్‌ను ఆమె మెచ్యురిటికి సాక్ష్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కానీ ఆమె చేసిన ట్వీట్ పలు రకాలుగా వివాదం అవుతున్న నేపథ్యంలో దానిని తొలగించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. లావణ్య ట్వీట్ డిలీట్ చేయడానికి కారణమేమిటో అంతు పట్టడం లేదు. ఎవరైనా ఆమెను ఎవరైనా డీలీట్ చేసే విధంగా ప్రభావం చేశారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.

    ఇటీవల స్పీకర్ వివాదంగా

    ఇటీవల స్పీకర్ వివాదంగా

    తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బ్రహ్మణ కమ్యూనిటిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరుశురామ అనే పౌరాణికి కార్యక్రమంలో హిందువులు, బ్రహ్మణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై లావణ్య త్రిపాఠి ఏమైనా స్పందించారా లేదా మరో విషయాన్ని టార్గెట్ చేసుకొని కామెంట్ చేశారా అనే విషయంపై చర్చ జరుగుతున్నది.

    English summary
    Tollywood actor Lavanya Tripathi tweets on Brahmin Caste. He said, Superiority comes on act of Individuals, not from Caste. After this remarks, She deleted a post, which goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X