twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేటి కష్టమే రేపటి ప్రతిఫలం.. లావణ్య త్రిపాఠి వర్కౌట్లు వైరల్

    |

    ప్రస్తుతం హీరోయిన్లందరూ జిమ్ బాట పట్టారు. ఇన్నాళ్లూ లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉండటం, డైట్ ఫాలో అవ్వకపోవడం, ఇష్టమొచ్చినట్టుగా ఫుడ్ తీసుకోవడంతో ఇప్పుడు అందరూ కసరత్తులు చేస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభం అవుతుండటంతో అందరూ మళ్లీ జీరో సైజ్‌లోకి మారేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాశీ ఖన్నా, రష్మిక మందాన్న, లావణ్య త్రిపాఠి వంటి హీరోయిన్లందరూ జిమ్ బాట పట్టారు.

    పైగా లావణ్య త్రిపాఠి, నిహారిక ఇద్దరూ కూడా జిమ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి వర్కవుట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు బాగానే క్లోజ్ అయినట్టు కనిపిస్తున్నారు. సెల్ఫీలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పైగా నిహారిక తన ఫియాన్సీ చైతన్యను కూడా జిమ్‌కు రమ్మని పిలిచినట్టుంది. అతను కూడా రెగ్యులర్‌గా వర్కౌట్లు చేస్తున్నాడు. అయితే తాజాగా లావణ్య ఓ వీడియోను షేర్ చేసింది.

     Lavanya Tripathi workouts video goes viral

    మనం ఈ రోజు ఎంత కష్టపడితే ఎంత బాధను అనుభవిస్తే రేపు అంతగా ప్రతిఫలిం వస్తుంది అని చెబుతూ జిమ్‌లొ ఎలా కష్టపడుతున్నానో తెలిపే ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో బరువులు కూడా బాగానే ఎత్తినట్టు కనిపిస్తోంది. ఇక లావణ్య ప్రాజెక్ట్‌‌ల విషయానికి వస్తే ఈ మధ్యే చావు కబురు చల్లగా షూటింగ్‌లో పాల్గొంది. ఇక ఏ1 ఎక్స్‌ప్రెస్ షూటింగ్‌లోనూ పాల్గొనేందుకు రెడీ అవుతోంది. అందులో లావణ్య హాకీ ప్లేయర్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

    English summary
    Lavanya Tripathi workouts video goes viral, I am not there yet, but will be soon The pain you feel today will be the strength you feel tomorrow.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X