Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేటి కష్టమే రేపటి ప్రతిఫలం.. లావణ్య త్రిపాఠి వర్కౌట్లు వైరల్
ప్రస్తుతం హీరోయిన్లందరూ జిమ్ బాట పట్టారు. ఇన్నాళ్లూ లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉండటం, డైట్ ఫాలో అవ్వకపోవడం, ఇష్టమొచ్చినట్టుగా ఫుడ్ తీసుకోవడంతో ఇప్పుడు అందరూ కసరత్తులు చేస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభం అవుతుండటంతో అందరూ మళ్లీ జీరో సైజ్‌లోకి మారేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాశీ ఖన్నా, రష్మిక మందాన్న, లావణ్య త్రిపాఠి వంటి హీరోయిన్లందరూ జిమ్ బాట పట్టారు.
పైగా లావణ్య త్రిపాఠి, నిహారిక ఇద్దరూ కూడా జిమ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి వర్కవుట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు బాగానే క్లోజ్ అయినట్టు కనిపిస్తున్నారు. సెల్ఫీలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పైగా నిహారిక తన ఫియాన్సీ చైతన్యను కూడా జిమ్‌కు రమ్మని పిలిచినట్టుంది. అతను కూడా రెగ్యులర్‌గా వర్కౌట్లు చేస్తున్నాడు. అయితే తాజాగా లావణ్య ఓ వీడియోను షేర్ చేసింది.
మనం ఈ రోజు ఎంత కష్టపడితే ఎంత బాధను అనుభవిస్తే రేపు అంతగా ప్రతిఫలిం వస్తుంది అని చెబుతూ జిమ్‌లొ ఎలా కష్టపడుతున్నానో తెలిపే ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో బరువులు కూడా బాగానే ఎత్తినట్టు కనిపిస్తోంది. ఇక లావణ్య ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే ఈ మధ్యే చావు కబురు చల్లగా షూటింగ్లో పాల్గొంది. ఇక ఏ1 ఎక్స్‌ప్రెస్ షూటింగ్‌లోనూ పాల్గొనేందుకు రెడీ అవుతోంది. అందులో లావణ్య హాకీ ప్లేయర్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.