అమెరికాలో గిన్నెలు కడిగేవారా.. స్టార్‌ హీరోయిన్‌‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఘోర అవమానం

ఇప్పుడంటే తెలుగు అమ్మాయిలకు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం లేదు కానీ ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలింది తెలుగు నటీమణులే అన్న సంగతి తెలిసిందే. ముంబై భామల పోటీని తట్టుకుని నిలబడి మరి అవకాశాలు దక్కించుకుని సత్తా నిరూపించుకున్నారు. ఈ కోవలోకే వస్తారు లయ. తన అందం, చిరునవ్వుతో కొన్నేళ్లపాటు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేశారు. పెళ్లి చేసుకుని ఫారిన్‌లో సెటిలైన లయ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

21 అక్టోబర్ 1981న విజయవాడలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు లయ. ఆమె తండ్రి డాక్టర్. స్కూల్ డేస్‌లో స్టేట్ లెవల్ చదరంగం క్రీడాకారిణిగా లయ రాణించారు. తర్వాతి రోజుల్లో హైదరాబాద్‌కు మకాం మార్చిన ఆమె క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని దాదాపు 50కి పైగా స్టేజ్ షోలు ఇచ్చి సత్తా చాటారు. ఎంసీఏ పూర్తి చేసిన లయ 1992లో భద్రం కొడుకో అనే సినిమాలో బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఏడేళ్ల తర్వాత 1999లో స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

laya faces shocking incident during checking process at airport

ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, కోదండ రాముడు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, విజయేంద్ర వర్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా తదితర చిత్రాలతో హోమ్లీ బ్యూటీగా ఆకట్టుకున్నారు. కళ్లు, నవ్వుతో కొన్నేళ్ల పాటు యువతకు ఫేవరేట్ హీరోయిన్‌గా నిలిచారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లయ. అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్‌ను పెళ్లాడిన లయ అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె.

2010లో భూలోకం టూ యమలోకం వయా భూలోకం అనే సినిమాలో నటించిన లయ ఆ తర్వాత వెండితెరకు , తెలుగువారికి దూరమయ్యారు. ఆమె ఏమయ్యారో, ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియనంతగా సైలెంట్ అయ్యారు. అయితే తిరిగి 2018లో రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ అంటోనీతో రీ ఎంట్రీ ఇచ్చారు లయ. ఈ సినిమాలో హీరోయిన్ ఇలియానాకు తల్లిగా గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో లయ షాక్ అయ్యారు.

తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ట్రై చేస్తున్న దశలో కరోనా ముంచుకు రావడం , లాక్‌డౌన్‌తో అమెరికాలోని ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగు సినిమా పాటలకు రీల్స్ చేస్తూ లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఆ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో మరోసారి లయ గురించి చర్చించుకున్నారు అభిమానులు. దాంతో భారత్‌కు రావాలని అనుకుని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగగా ఆమెకు ఘోర అవమానం జరిగిందట.

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ ఈ విషయాలు పంచుకున్నారు. కస్టమ్స్ చెకింగ్‌లో తనకు ఎంత సేపటికీ ఫింగర్ ప్రింట్ పడకపోవడంతో ఇబ్బంది పడ్డానని.. చివరికి శానిటైజర్‌తో చేతులు తుడుచుకున్నాకే ఓకే అయ్యిందని లయ తెలిపారు. అక్కడి నుంచి వెళ్లబోతుండగా అమెరికాలో గిన్నెలు తోమేవారా? మీ చేతులు అంత రఫ్‌గా ఉన్నాయని కస్టమ్స్ అధికారి ప్రశ్నించడంతో తాను షాకైనట్లు లయ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: laya movie news tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X