twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన లీడర్ హీరోయిన్.. స్వామీజిని పెళ్లి చేసుకోవాలని ఉందని కామెంట్

    |

    సినిమా ప్రపంచంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉన్న వారు కూడా అప్పుడప్పుడు చేసే కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి గురించి హీరోయిన్స్ ఎలాంటి కామెంట్ చేసినా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ రోజుల్లో చాలా తొందరగా వైరస్ తరహాలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. రీసెంట్ గా ఒక ప్రముఖ హీరోయిన్ కూడా అదే తరహాలో చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. నిత్యానందనను పెళ్లి చేసుకోవాలని ఆలోచనను వ్యక్తపరచడంతో ఆమె పేరు హాట్ టాపిక్ గా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    కోర్టు కేసులు

    కోర్టు కేసులు

    నిత్యానందస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యాచారం ఆరోపణలు అలాగే కొంతమంది యువతులను అక్రమంగా నిర్బంధించడం పలు రాజకీయ వివాదాలతో కోర్టు కేసులో చిక్కుకున్నాడు. అతనిపై గతంలో చాలా రకాల ఆరోపణలు అయితే వచ్చాయి అంతే కాకుండా ఒక మాజీ హీరోయిన్ తో కూడా రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. అనంతరం దేశం నుంచి పారిపోయాడు.

    బెడ్ రూమ్ లో అలా..

    బెడ్ రూమ్ లో అలా..

    అప్పట్లో ఒక ప్రముఖ మాజీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా నిత్యానంద పేరు నేషనల్ మీడియాలో కూడా బాగానే వైరల్ అయింది. అతన్ని భక్తితో కొలిచిన వారు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక మహిళ నిత్యానంద గుట్టును బయటపెట్టేందుకు అతని బెడ్ రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టడంతో స్వామి వివేకానంద బండారం మొత్తం బయట పడిపోయింది.

    ఐలాండ్ కొనుగోలు చేసి

    ఐలాండ్ కొనుగోలు చేసి

    ప్రస్తుతం నిత్యానంద ప్రత్యేకంగా ఒక ఐలాండ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. సొంతంగా ఈక్వెడార్ దగ్గరలో ఐలాండ్ కొనుగోలు చేసిన నిత్యానంగా అక్కడ తన సొంత రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. ప్రత్యేకంగా కరెన్సీ కూడా ముద్రించిన అతను అక్కడికి రాబోయే భక్తులకు ప్రత్యేకంగా శంకరుడి దర్శనం కూడా ఇప్పిస్తాను అని చెబుతున్నాడు. స్వామి వివేకానంద ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తన రాజ్యానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తున్నాడు.

    పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ కామెంట్

    పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ కామెంట్

    అయితే అలాంటి క్రిమినల్ కేసు ఉన్న స్వామి వివేకానంద విషయంలో చాలామంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్న క్రమంలో ప్రియా ఆనంద్ మాత్రం ఎవరు ఊహించిన విధంగా అతన్ని పెళ్లి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనను తెలపడం మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యేలా చేసింది. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా వివరణ ఇచ్చింది.

    డిజాస్టర్స్ అనంతరం

    డిజాస్టర్స్ అనంతరం

    ప్రియా ఆనంద్ తెలుగులో లీడర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె రామ్ పోతినేనితో రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమా కూడా చేసింది. కానీ ఆ తర్వాత సిద్ధార్థ తో చేసిన 180 సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఆమె మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఎక్కువగానే తమిళ సినిమాలతోనే బిజీగా మారిపోయింది

    పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని..

    పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని..

    అయితే ఇటీవల ఆమె సుశాంత్ తో ఒక ప్రత్యేకమైన వెబ్ సిరీస్ కూడా చేసింది. 'మా నీళ్ల ట్యాంక్' అనే ఆ వెబ్ సిరీస్ జూలై 15వ తేదీ నుంచి జి 5 లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రత్యేకంగా వెబ్ సిరీస్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్న స్వామి నిత్యానందను పెళ్లి చేసుకుంటే పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అని సరదాగానే ఆన్సర్ ఇచ్చింది. అయితే సరదాగా కూడా అలా కామెంట్ చేయకూడదు అని సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వడం తో వెంటనే ఆమె అది జోక్ గా అన్నాను అంటూ మరో సమాధానం కూడా ఇచ్చింది.

    English summary
    Leader actress priya anand marriage comments on Nithyananda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X