For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కంగన స్నేహితురాలు.. రెండు కోట్ల యాడ్ రిజెక్షన్.. బర్త్‌డే గర్ల్ సాయి పల్లవి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  |

  మలయాళంలో 'ప్రేమమ్' అనే సినిమాలో మలార్ గా నటించి యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది సాయి పల్లవి. ముందుగ తెలుగులో ఫిదా సినిమాతో ఆ దెబ్బకి తెలుగులో కూడా ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఫిదా సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైంది.

  భానుమతి, హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అనే డైలాగ్ తో ఈ భామ విపరీతమైన క్రేజ్ సంపాదించింది.. ఆ సినిమా మొదలు తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఆమె సినిమాలు చేస్తోంది. ఇక సాయి పల్లవి ఈరోజు 29 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  ప్రభుదేవా రియాలిటీషోతో

  ప్రభుదేవా రియాలిటీషోతో

  సాయి పల్లవి తమిళ్ డాన్స్ రియాలిటీ షో, ఉంగలీల్ యారు అదుత ప్రభు దేవా అనే షో ద్వారా టెలివిజన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ షో 2008లో టెలికాస్ట్ అయింది. ఇక ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె అక్కడితో ఆగలేదు. ఈటీవీ తెలుగులో ఢీ అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 4లో కూడా పాల్గొంది.

  ఇక సాయి పల్లవి హీరోయిన్ గా మారాక ఆమె ప్రభుదేవాతో కలిసి మారి 2 సాంగ్ చేసింది.. ఆ సాంగ్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తో కలిసి ఫోటో తీసుకుని సాయి పల్లవి దానిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సరిగ్గా ఇదే సెట్ లో మేము పదేళ్ళ క్రితం పని చేశామని ఆమె చెప్పుకొచ్చింది..

  మితభాషి

  మితభాషి

  ఇక సాధారణంగా సాయిపల్లవి మితభాషి. అవసరం లేనిదే ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా ఏ వయసు వారితో అయినా సరే ఎంతో హుందాగా గౌరవం ఇస్తూ మాట్లాడుతుంది.. అయితే ఒక్కసారి కెమెరా స్విచ్చాన్ చేస్తే ఆమె పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర తాలూకు జీవం పోస్తుంది.

  కంగన స్నేహితురాలుగా

  కంగన స్నేహితురాలుగా

  నిజానికి ఆమెకు సినిమాల్లో అది మొదటి అవకాశం కాకపోయినా సాయిపల్లవి వివాదాస్పద నటి కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ అనే తమిళ సినిమాలో కంగనా స్నేహితురాలి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పేరు కూడా వేయలేదు కానీ బాలనటి ఒక సినిమా చేసిన తర్వాత నటిగా చేసిన మొదటి సినిమా కావడంతో టెక్నికల్ గా ఇది సాయి పల్లవికి మొదటి సినిమా అని చెప్పాలి.

  క్లాసులు ఎగ్గొట్టి

  క్లాసులు ఎగ్గొట్టి

  ఇక సాయి పల్లవి స్కూల్ చదివే రోజుల్లో ఎక్కువగా ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ వీడియోలు చూసేవారట. వారి వీడియోలు చూసి డాన్స్ ఎలా వేయాలి అనే విషయంలో ఆమె ప్రాక్టీస్ చేసేదని చెబుతూ ఉంటారు. అంతేకాదు డాన్స్ నేర్చుకోవడం కోసం ఆమె క్లాసులు సైతం ఎగ్గొట్టేదట. క్లాసులు ఎగ్గొట్టి అదే స్కూల్లో ఉన్న ఆడిటోరియంలో డాన్స్ ప్రాక్టీస్ చేసేది అని చెబుతూ ఉంటారు.

  యాక్టర్ అయ్యాక డాక్టర్

  యాక్టర్ అయ్యాక డాక్టర్

  ఇది సాధారణంగా అందరూ నేను డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతూ ఉంటారు కదా, అలాగే సాయి పల్లవి డాక్టర్ పూర్తి చేసి ఇప్పుడు యాక్టర్ గా స్థిరపడింది. సాయి పల్లవి జార్జియా దేశం నుంచి మెడిసిన్ లో డిగ్రీ డాక్టరేట్ పొందింది. ఈ మధ్య కాలంలోనే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి చేసింది. అలా మొత్తం మీద డాక్టర్ ప్లస్ యాక్టర్ గా ఉన్న అతి కొద్ది మంది సినీ నటుల్లో ఒకరిగా సాయిపల్లవి మారింది.

  రెండు కోట్ల డీల్ కూడా వద్దనుకుని

  రెండు కోట్ల డీల్ కూడా వద్దనుకుని

  ఇక సాయి పల్లవి మేకప్ లేకుండానే నటిస్తుంది. ఆమె మొదటి సినిమా నుంచి ఆమె ఇదే పద్ధతి ఫాలో అవుతుంది. అయితే దీని వలన ఆమె రెండు కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ కూడా వదులుకుంది. సాధారణంగా ఫెయిర్నెస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్ లో హీరోయిన్స్ ను చూపిస్తూ ఇది వాడితే వారిలా తయారవుతూ ఉంటారని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. కానీ కానీ ఇలాంటి క్రీములు వాడితే అందంగా కనిపిస్తారు అని చెప్పడం ఇష్టం లేని సాయి పల్లవి రెండు కోట్ల రూపాయల డీల్ కూడా తోసిపుచ్చింది.

  సినిమాల్లో బిజీబిజీగా

  సినిమాల్లో బిజీబిజీగా


  ఇక ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకి నీది నాది ఒకే కథ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేయగా ఆ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

  English summary
  Sai Pallavi grabbed everyone's attention and won millions of hearts with her role as Malar in the 2015 Malayalam film Premam. Since then shes getting back to back offers. Sai Pallavi turns 29 today, May 9 and here are the some Lesser Known Facts about sai pallavi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X