లైగర్ పాప సరికొత్త అందాల అస్త్రం.. ఆ పరువాల ప్రదర్శనకు సాటి ఎవ్వరు?

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చి ఘోరంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా లైగర్. ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన గ్లామరస్ డాల్ అనన్య పాండే. బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తెగా అడుగు పెట్టిన ఈ సుందరి తెలుగులో తొలి సినిమాతో భారీ నెగెటివిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అనన్య పాండే సినిమాల తీరు ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ హైప్ ఇస్తుంది. దీంతో ఆమె అందానికి అభిమానులు అవుతున్నారు. తాజాగా ఆమె వదిలిన ఫొటోలపై లుక్కేస్తే..

పురస్కారాలు: బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తెగా వెండితెరపైకి తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అనన్య పాండే. యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డు కూడా అందుకుని ఆశ్చర్యపరిచింది.

Ananya Panday

వివాదం-మంచి పేరు: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత పతీ పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ లాంటి చిత్రాలతో నార్త్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది గ్లామర్ బ్యూటి అనన్య పాండే. తర్వాత అంగ్రేజీ మీడియం అనే సినిమాలో గెస్ట్ రోల్ తో కూడా ఆకర్షించింది ఈ క్యూట్ బ్యూటి. ఇటీవల చేసిన గెహరియాన్ సినిమా వివాదస్పదమైనప్పటికీ అనన్యకు మాత్రం మంచి పేరే వచ్చింది.

Ananya Panday

హిందీ సినిమాలు: బాలీవుడ్ లో నటనతో ఆకట్టుకుంటూ ముందుకు సాగిన అనన్య పాండే తెలుగులో లైగర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ఇందులో అనన్య నటనపై విమర్శలు రావడమే కాదు.. మీమ్స్ కూడా హల్ చల్ చేశాయి. దీంతో హిందీ సినిమాలవైపు మొగ్గు చూపింది ఈ చిన్నది.

Ananya Panday

బాలీవుడ్ హీరోతో: బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది అనన్య పాండే. డ్రీమ్ గర్ల్ 2, ఖో గయా హమ్ ఖహాన్ సినిమాలతో పాటు కాల్ మి బా (Call Me Bae) వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో అనన్య పాండే డేటింగ్ చేస్తుందని ఈ మధ్య వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

పరువాల ప్రదర్శన: సినిమాలు, రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నా అనన్య పాండే సోషల్ మీడియాలో వడ్డించే గ్లామర్ ట్రీట్ కు మాత్రం కొదవ ఉండదు. తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో తన పరువాలు, స్కిన్ అందాలతో మైమరిచిపోయేలా చేసింది ఈ గ్లామర్ చిన్నది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ కాగా.. అనన్య పాండే పరువాల ప్రదర్శన తరహాలో ఎవరూ చూపించరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X