సాగరతీరంలో లైగర్ బ్యూటి ఊహించిని గ్లామర్ ట్రీట్.. ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ పరువాల విందు
పక్క సినీ ఇండస్ట్రీల నుంచి అందమైన ముద్దుగుమ్మలను హీరోయిన్లుగా తెలుగులోకి తెచ్చుకోవడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితే. అలా ఎంతోమంది బ్యూటిఫుల్ సుందరాంగులు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. కొంతమంది మాత్రమే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అలాంటి వారిలో సన్నజాజి తీగలా ఉండే బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే ఒకరు. ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న చిన్నది సోషల్ మీడియాలో ఊహించని విధంగా తన అందచందాలను బయటపెట్టేస్తోంది. ఫలితంగా కుర్రాళ్లకు గుబులు పుట్టిస్తోంది.
అతనితో జోడి : హిందీ చిత్ర పరిశ్రమలోని పాపులర్ యాక్టర్స్ లో చుంకీ పాండే ఒకరు. సాహో, లైగర్ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. అయితే ఆయన కుమార్తెగా వెండితెరపైకి తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అనన్య పాండే. యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో అనన్య హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చి ఆకట్టుకుంది.

సీక్వెల్ తో : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో క్యూట్ బ్యూటి అలియా భట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా.. దానికి సీక్వెల్ గా వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో అనన్య పాండే అడుగు పెట్టింది. ఈ సినిమా తరువాత పతీ పత్నీ ఔర్ వో అనే సినిమాలో కూడా నటించింది అలరించింది అనన్య. దీనికి ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్, ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డులను అందుకుంది.

అలా దగ్గరిగా : ఇక 2020 సంవత్సరంలో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి రొమాన్స్ చేసింది స్లిమ్ బ్యూటి అనన్య పాండే. ఆ సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.కరోనా కారణంగా జీ ఫ్లెక్స్ ఓటీటీలో నేరుగా రిలీజైన ఈ మూవీ తర్వాత అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దగుమ్మ.

పూరీ దర్శకత్వం : అంగ్రేజీ మీడియం సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అనన్య పాండే. ఇలా వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు దక్షిణాది నుంచి అవకాశాలు రావడం మొదలు అయింది. ఈ క్రమంలోనే తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

ప్రజంట్ సినిమాలు : బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన లైగర్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేసింది అనన్య పాండే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అట్టర్ ప్లాప్ అయింది. తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. ప్రస్తుతం అనన్య హిందీలో డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్ సినిమాలు చేస్తోంది.
సాగరతీరంలో : సినిమాల సంగతి అలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో తెగ గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది లైగర్ పాప అనన్య పాండే. తాజాగా రెండు గుడ్డ ముక్కలతో (పింక్ కలర్ బికినీ) సాగర తీరంలో దర్శనం ఇచ్చిన ఈ బ్యూటి తన స్లిమ్ ఫిజిక్ మొత్తం చూపించేసింది. ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ ఘాటు పరువాల విందు చేసింది. దీంతో అవి వైరల్ గా మారి నెట్టింట్లో హీట్ పుట్టిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











