బికినీతో రెచ్చిపోయిన లైగర్ హీరోయిన్: ఆమెనిలా చూశారంటే అస్సలు తట్టుకోలేరు!
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లో స్టార్ల వారసులు ఎంతో మంది ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవడంతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే పేరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను, స్టార్‌డమ్‌ను దక్కించుకుంది.
ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దీంతో అందులో రచ్చ చేస్తోంది. తాజాగా అనన్య తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

అలా ఎంటరైన అనన్య పాండే
లెజెండరీ యాక్టర్ ఫ్యామిలీ నుంచి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా అనన్య పాండే చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అనన్యకు ప్రశంసలతో పాటు అవార్డులూ వచ్చాయి.

సినిమాలు తక్కువైనా ఫేమస్
మొదటి సినిమాతోనే అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న అనన్య పాండేకు బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం తన రోల్‌ను చూసుకునే సినిమాలు ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ' వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

టాలీవుడ్‌లోకి కూడా వస్తుంది
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'లైగర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే తెలుగు సహా దక్షిణాది భాషలన్నింట్లోకి ఎంటర్ అవబోతుంది.

అలాంటి పాత్ర.. హాట్ టాపిక్
ఇటీవలే అనన్య పాండే 'గెహరియాన్' అనే సినిమాలో నటించింది. ఇందులో ఈ అమ్మడు బోల్డుగా కనిపించి షాకిచ్చింది. ఇందులో దీపికా పదుకొనేతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ హాట్ టాపిక్ అయిపోయింది. అలాగే, డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కోవడం.. డేటింగ్ వార్తలు వంటి వాటితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో అనన్య భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూ
హీరోయిన్‌గా పెద్దగా గ్లామర్ ట్రీట్ ఇవ్వకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ యంగ్ హీరోయిన్ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతోంది. ఇలా చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

బికినీతో రెచ్చిపోయిన భామ
కొంత కాలంగా అనన్య పాండే ఏదో ఒక ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టూ పీస్ బికినీ వేసుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











