జాకెట్ విప్పేసి షాకిచ్చిన అనన్య పాండే: రెచ్చగొట్టేలా ఘాటు ఫోజు.. మరీ ఈ రేంజ్‌లో చూపిస్తుందేంటబ్బా!

సినీ ఇండస్ట్రీల్లోకి స్టార్ల వారసులు హీరోలుగానో.. హీరోయిన్లుగానో ఎంట్రీ ఇస్తుంటారు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే ఇది బాలీవుడ్‌లో ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఎంతో మంది తెరంగేట్రం చేసి.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుని స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

చిన్న వయసులోనే డిసైడ్ అయింది

చిన్న వయసులోనే డిసైడ్ అయింది

చాలా కాలం పాటు బాలీవుడ్‌లో తన మార్క్ సినిమాలు చేసి భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు వెర్సటైల్ యాక్టర్ చుంకీ పాండే. విలక్షణమైన నటనతో వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. చాలా కాలం పాటు హవాను చూపించారు. ఈ లెజెండరీ యాక్టర్ కూతురే ఇప్పటి హీరోయిన్ అనన్య పాండే. టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

అలా పరిచయం.. ఫస్ట్ మూవీతో క్రేజ్

అలా పరిచయం.. ఫస్ట్ మూవీతో క్రేజ్

చాలా చిన్న వయసులోనే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయం అయింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, అనన్యకు ప్రశంసలు దక్కడంతో పాటు ఎన్నో అవార్డులను అందించింది.

చేసింది తక్కువే.. గుర్తింపు ఎక్కువగా

చేసింది తక్కువే.. గుర్తింపు ఎక్కువగా

మొదటి చిత్రమే హిట్ అవడంతో గ్రాండ్ ఎంట్రీని అందుకుంది అనన్య పాండే. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే, పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ' అనే చిత్రాల్లో నటించింది. ఈ అన్నింట్లో తన అందంతో పాటు యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది.

విజయ్‌తో రొమాన్స్ చేస్తోన్న స్టార్ కిడ్

విజయ్‌తో రొమాన్స్ చేస్తోన్న స్టార్ కిడ్

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'లైగర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే తెలుగు సహా దక్షిణాది భాషలన్నింట్లోకి పరిచయం అవుతుంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ ముందుకెళ్తోందీ బ్యూటీ.

అందాల విందు చేస్తూ అనన్య రచ్చ

అందాల విందు చేస్తూ అనన్య రచ్చ

సినిమాల్లో పెద్దగా స్కిన్ షో చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆ లోటును భర్తీ చేస్తుంటుంది యంగ్ హీరోయిన్ అనన్య పాండే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతోంది. ఇలా చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ హైలైట్ అవుతోంది.

Recommended Video

Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
జాకెట్ విప్పేసి షాకిచ్చిన హీరోయిన్

జాకెట్ విప్పేసి షాకిచ్చిన హీరోయిన్

ఎప్పుడూ ఏదో ఒక ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటుంది అనన్య పాండే. ఈ క్రమంలోనే తాజాగా ఓ డిజైనర్ డ్రెస్ వేసుకుని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ విప్పేసినట్లు కనిపించింది. దీంతో లోదుస్తులతో పాటు ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్ విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X