రెచ్చిపోయిన లైగర్ హీరోయిన్: అందాల ఆరబోతలో బౌండరీ దాటేసి.. ఘాటు ఫోజులతో రచ్చ
పదేళ్ల కాలంలో సినీ పరిశ్రమలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లోనే ఎక్కువ మంది పరిచయం అయ్యారు. అలా వచ్చిన వారిలో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుని స్టార్లుగా ఎదిగిపోయారు కొందరు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను దక్కించుకుంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరూ చూసేయండి!

టీనేజ్‌లోనే సినిమాలపై నిర్ణయం
సుదీర్ఘ కాలం పాటు తన మార్క్ సినిమాలతో బాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు వెర్సటైల్ యాక్టర్ చుంకీ పాండే. విలక్షణమైన నటనతో వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. చాలా కాలం పాటు హవాను చూపించారు. ఈ యాక్టర్ కూతురే ఇప్పటి హీరోయిన్ అనన్య పాండే. టీనేజ్‌లోనే ఆమె సినిమాలపై డిసైడ్ అయింది.

అలా వచ్చింది.. క్రేజ్ పట్టేసిందిగా
చిన్న వయసులోనే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా అనన్య పాండే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, అనన్యకు ప్రశంసలు దక్కడంతో పాటు ఎన్నో అవార్డులను సాధించి పెట్టింది.

తక్కువ సినిమాలు.. గుర్తింపు అలా
ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ అవడంతో గ్రాండ్ ఎంట్రీని అందుకుంది అనన్య పాండే. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే, పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ' అనే చిత్రాల్లో నటించింది. ఈ అన్నింట్లో తన అందంతో పాటు యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించింది.

విజయ్‌తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'లైగర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే తెలుగు సహా దక్షిణాది భాషలన్నింట్లోకి పరిచయం కాబోతుంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే
సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ దూసుకుపోతోందీ భామ.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోన్న నటి
హీరోయిన్‌గా గ్లామర్ ట్రీట్ ఇవ్వకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆ లోటును భర్తీ చేస్తుంటుంది యంగ్ హీరోయిన్ అనన్య పాండే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతోంది. ఇలా చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ట్రెండ్ అవుతోంది.

హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన భామ
అనన్య పాండే ఎప్పుడూ ఏదో ఒక ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ డిజైనర్ డ్రెస్ వేసుకుని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ డ్రెస్ ధరించింది. అయితే, ఈ పిక్స్‌లో అనన్య ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వీటికి రెస్పాన్స్ రావడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











