Don't Miss!
- News
Pavan Kalyan: ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. పోలీసులు ఏం చేశారంటే..!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Ananya Panday: బికినీలో లైగర్ బ్యూటి ఓవర్ డోస్ షో.. అలా కూర్చోని అంతా చూపిస్తూ!
సినీ రంగంలో నటినటుల కొడుకులు, కుమార్తెలు ఎంట్రీ ఇచ్చి తమదైన శైలీలో సత్తా చాటుతున్నారు. అలా స్టార్ నటుడి కూతురిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్ అనన్య పాండే. అనేక సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు చుంకీ పాండే. ఆయన కుమార్తెగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన లైగర్ తో తెలుగులో కూడా డెబ్యూ చేసింది. ఇక ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తన బికినీ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది ఈ భామ.

అంతకుమించిన డిజాస్టర్..
అనన్య పాండే ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే అనన్య పాండే టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు తెరకు పరిచయం చేసిన మరో బ్యూటి కాబట్టి. అంతేకాకుండా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జత కట్టిన ఈ భామ తెలుగులో డెబ్యూ చేసిన సినిమా లైగర్. ఈ సినిమా ఎలాంటి అంచనాలతో వచ్చిందో.. అంతకుమించిన డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

ట్రోలింగ్ బారిన బ్యూటి..
పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ తో మరోసారి తెలుగు సినిమాలో నటించను అని తేల్చి చెప్పేసింది హాట్ బ్యూటి అనన్య పాండే. దీంతో అసలు మిమ్మల్ని తెలుగు సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ఎవరనుకుంటున్నారంటూ నెటిజన్సు ట్రోలింగ్ కూడా చేశారు. ఇలా లైగర్ డిజాస్టర్ కావడం.. అనన్య పాండే కామెంట్స్ వైరల్ అయి ట్రోలింగ్ బారిన పడటంతో తెలుగులో పాపులర్ అయింది అనన్య పాండే.

ఉత్తమ నటనకు అవార్డులు..
అనేక హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పతీ పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించింది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే మొదటి సినిమాకి ఆమె ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డులు కూడా సాధించింది.

ఇషాన్ ఖట్టర్ తో కలిసి..
2020లో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించింది అనన్య పాండే. ఆ సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా జీ ఫ్లెక్స్ ద్వారా రిలీజ్ అయింది. అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే మరో సినిమా ద్వారా కూడా అనన్య పాండే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

నిరాశ మిగిల్చిన లైగర్..
ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు సౌత్ లో సినిమాలు చేసిన వాళ్లే కావడం, ఆమె నటన హిందీలో క్లిక్ కావడంతో అనన్య పాండేకు సౌత్ నుంచి బంపర్ ఆఫర్ తగిలింది. అదే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కి సంబంధించిన పూరి కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండేకు నిరాశే మిగిలింది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో..
అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా అందులో అమ్మడు గ్లామర్ మాత్రం బాగానే క్లిక్ అయింది. ఇక ఇప్పుడు నిత్యం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది ఈ భామ. తరచుగా బికినీ ఫొటోలు పెడుతూ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా థాయ్ లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే తాజాగా బీచ్ లో దిగిన బికినీ ఫొటోలను షేర్ చేసింది.
బికినీ ఫొటోలతో..
ఇసుక తిన్నెలపై కూర్చున్న అనన్య పాండే బ్లూ కలర్ టూ పీస్ బికినీ ధరించి హాట్ గా పోజులిచ్చింది. ఓ వైపు బుక్ చదువుకుంటూనే మరోవైపు తన అందాలను ప్రదర్శించింది. ఈ ఫొటోలో తన థైస్, ఎద అందాలతోపాటు బ్యాక్ అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే అనన్య పాండే డ్రీమ్ గర్ల్ 2 సినిమాతోపాటు మరో చిత్రంలో నటిస్తోంది.