For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మదర్స్ డే స్పెషల్: తల్లి బికినీ ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. అంత అందంగా ఉండడానికి కారణం అదేనంటూ!

  |

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లోనే ఎక్కువగా వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. అందులోనూ అక్కడ అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. ఇలా వచ్చిన చాలా మంది ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో లేలేత అందాల చిన్నది అనన్య పాండే ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే నేడు మదర్స్ డే సందర్భంగా తన తల్లి బికినీ ఫొటోను షేర్ చేసింది. ఇది చూసిన వారంతా విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  బాలీవుడ్ స్టార్ డాటర్‌గా పరిచయం

  బాలీవుడ్ స్టార్ డాటర్‌గా పరిచయం

  దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో తన హవాను చూపించి.. వందకు పైగా సినిమాల్లో నటించారు చుంకీ పాండే. విలక్షణమైన నటనతో సినీ రంగంలో తనదైన శైలిని ఏర్పరచుకున్న ఆయన.. ఎన్నో మరపురాని పాత్రలను పోషించారు. ఆయన కూతురిగానే సినీ రంగంలోకి అడుగు పెట్టింది అనన్య పాండే. టీనేజ్‌లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయింది.

   ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనన్య

  ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనన్య

  పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయం అయింది. టైగర్ ష్రాఫ్ ఇందులో హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్రను పోషించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, అనన్యకు ఎంతో పేరును అవార్డులను తెచ్చి పెట్టింది.

  చేసింది తక్కువే.. భారీగా పాపులర్

  చేసింది తక్కువే.. భారీగా పాపులర్

  మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది అనన్య పాండే. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, సెలెక్టివ్‌గానే చేసుకుంటూ వెళ్తోంది. ఇక, ఇప్పటి వరకూ ఈ చిన్నది ‘పతీ పత్నీ ఔర్ వో', ‘అంగ్రేజీ మీడియం', ‘ఖాలీ పీలీ' అనే సినిమాల్లో నటించింది. వీటన్నింటిలోనూ అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో తక్కువ సినిమాలకే పాపులర్ అయింది.

  విజయ్‌తో రొమాన్స్‌కు రెడీ అయింది

  విజయ్‌తో రొమాన్స్‌కు రెడీ అయింది

  టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘లైగర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే తెలుగు సహా దక్షిణాది భాషలన్నింట్లోకి అడుగు పెట్టబోతుంది.

   అందులో యమ యాక్టివ్.. ఫుల్ క్రేజ్

  అందులో యమ యాక్టివ్.. ఫుల్ క్రేజ్

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ రికార్డు క్రియేట్ చేస్తోంది.

  తల్లి బికినీ ఫొటో షేర్ చేసిన హీరోయిన్

  తల్లి బికినీ ఫొటో షేర్ చేసిన హీరోయిన్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యంగ్ హీరోయిన్ అనన్య పాండే.. అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. అయితే, తాజాగా మదర్స్ డేను పురస్కరించుకుని ఓ స్పెషల్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ ఫొటోల్లో అనన్య తల్లి భావనా పాండే బికినీ ధరించి ఉండడమే.

  అంత అందంగా ఉండడానికి కారణమిదే

  అంత అందంగా ఉండడానికి కారణమిదే

  మదర్స్ డే‌ను పురస్కరించుకుని షేర్ చేసిన ఈ ఫొటోలు ఇప్పటివి కాదు.. అనన్య పాండే చిన్నప్పటివి. తన తల్లితో ఉన్న ఈ పిక్స్‌ను ఇప్పుడు పోస్ట్ చేసిందామె. ఇక, ఇందులో భావనా పాండే ఎంతో అందంగా కనిపిస్తున్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు ‘అనన్య నువ్వు అందంగా ఉండడానికి కారణం మీ అమ్మే. ఈ విషయం ఇప్పుడే తెలిసింది' అని కామెంట్లు చేస్తుండడం విశేషం.

  English summary
  Ananya Panday is an Indian actress who works in Hindi films. The daughter of actor Chunky Pandey, she ventured into acting in 2019 with leading roles in the teen film Student of the Year 2 and the comedy Pati Patni Aur Woh. For the Student of the Year 2, she won the Filmfare Award for Best Female Debut and Zee Cine Award for Best Female Debut.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X