తల్లి హాట్ ఫొటోలు షేర్ చేసిన అనన్య: నా కోసం ఎందుకు ఉంచలేదంటూ కోపంతో.. ఇలా కూడా చేస్తారా!

మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అక్కడి స్టార్లు కొడుకులనే కాదు.. కూతుళ్లను కూడా సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లు వెండితెరపై ప్రవేశించారు. అలా వచ్చిన వారిలో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఎనలేని గుర్తింపును దక్కించుకుంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన తల్లి హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 టీనేజ్‌లోనే రెడీ అయిన స్టార్ డాటర్

టీనేజ్‌లోనే రెడీ అయిన స్టార్ డాటర్

సుదీర్ఘ కాలం పాటు హిందీ చిత్ర పరిశ్రమలో తన మార్క్ సినిమాలు చేసి భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు వెర్సటైల్ యాక్టర్ చుంకీ పాండే. విలక్షణమైన నటనతో వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. చాలా కాలం పాటు హవాను చూపించారు. ఈ లెజెండరీ యాక్టర్ కూతురే ఇప్పటి హీరోయిన్ అనన్య పాండే. టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయింది.

అలా ఎంట్రీ... ఫస్ట్ మూవీకే గుర్తింపు

అలా ఎంట్రీ... ఫస్ట్ మూవీకే గుర్తింపు

చిన్న వయసులోనే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయం అయింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్రను పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, అనన్య పాండేకు ప్రశంసలు దక్కడంతో పాటు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది.

తక్కువ చిత్రాలకే ఎక్కువ పాపులర్

తక్కువ చిత్రాలకే ఎక్కువ పాపులర్

ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ అవడంతో గ్రాండ్ ఎంట్రీని అందుకుంది అనన్య పాండే. ఈ చిత్ర ఫలితంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే, పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికి 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ' అనే చిత్రాల్లో నటించింది. ఈ అన్నింట్లో తన లేలేత అందాలతో మాయ చేయడంతో పాటు నటనతోనూ మెప్పించింది.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న అనన్య

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న అనన్య

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'లైగర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే తెలుగు సహా దక్షిణాది భాషలన్నింట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ దూసుకుపోతూనే ఉంది.

తల్లి హాట్ ఫొటోలు షేర్ చేసిన అనన్య

తల్లి హాట్ ఫొటోలు షేర్ చేసిన అనన్య

సోషల్ మీడియాలో సందడి చేసే యంగ్ హీరోయిన్ అనన్య పాండే.. అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన తల్లి భావనా పాండే హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అయిపోయాయి.

Recommended Video

Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
నాకు ఎందుకు ఉంచలేదంటూ కోపంతో

నాకు ఎందుకు ఉంచలేదంటూ కోపంతో

తన తల్లి భావనా పాండే పాత చిత్రాలను షేర్ చేసిన అనన్య పాండే.. 'ఇలాంటి కూల్ డ్రెస్‌లను నా కోసం ఎందుకు దాచి పెట్టలేదు' అంటూ వాటికి క్యాప్షన్లు కూడా పెట్టింది. తద్వారా తన తల్లిపై అలిగినట్లు కోపం ప్రదర్శించింది. గతంలో మదర్స్ సందర్భంగా ఏకంగా తన తల్లి బికినీ ఫొటోలనే షేర్ చేసింది అనన్య. అప్పట్లో ఇవి దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయిపోయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X