ఎలకలు పట్టడం నేర్చుకున్నా.. వాటిని తిన్నా కూడా.. జైభీం సినతల్లి సంచలనం!

సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన జై భీమ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. గత కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అయితే కొన్ని వివాదాలు ఈ సినిమా చుట్టుముట్టినా సరే తాజాగా ఈ సినిమాలో చిన్న తల్లి అనే ఒక ప్రధాన పాత్రలో నటించిన మలయాళ నటి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

లిజోమోల్ జొస్

లిజోమోల్ జొస్

లిజోమోల్ జొస్ అనే ఒక మలయాళ నటి ఉన్నదన్న సంగతి జై భీమ్ సినిమా విడుదలయ్యే వరకు తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. మలయాళ సినిమాలతో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఆమె రెండు భాషల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదల కావడానికి ముందే సిద్ధార్థ హీరోగా రూపొందిన ఒరేయ్ బామ్మర్ది అనే సినిమా ఆహా వేదికగా విడుదలైంది.

మార్మోగిపోయి

మార్మోగిపోయి

ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది కానీ ఆమె నటించిన విషయం పెద్దగా జనానికి గుర్తు ఉండే అవకాశం అయితే లేదు. అయితే ఎప్పుడైతే సూర్య ప్రధాన పాత్రల్లో నటించి స్వయంగా నిర్మించిన జై భీమ్ సినిమా విడుదలైందో, అందులో గిరిజన మహిళ పాత్ర పోషించిన ఆమె పేరు తమిళ తెలుగు మలయాళ భాషల్లో కూడా మార్మోగిపోయింది.

విశేష స్పందన

విశేష స్పందన

ఈ సినిమాలో ఆమె పాత్ర కు విశేష స్పందన లభించింది. జై భీమ్ సినిమా లో గిరిజన మహిళ ఒకరేమో రోల్ చేయడంతో ఆమె నేచురల్ నటనకు, పర్ఫామెన్స్ కు చాలా మంది అభిమానులు అయిపోయారు. అయితే తాజాగా ఈ పాత్ర గురించి తాజా ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించింది..

ఇంటెన్సిటీ అర్థమై

ఇంటెన్సిటీ అర్థమై

దర్శకుడు కథ చెప్పగానే ఆ పాత్రకు గల ఇంటెన్సిటీ తనకు అర్థమైందని ఆమె వెల్లడించింది. ఈ పాత్ర కోసం ఎంత దాకా అయినా కష్టపడాలని నిర్ణయించుకుని డైటింగ్ చేసి బరువు కూడా తగ్గాలని వెల్లడించింది.. నేను చేసింది ఒక గిరిజన స్త్రీ పాత్ర కావడంతో ఇంతకుముందు ఎప్పుడూ వాళ్ల గురించి ఎలాంటి విషయాలు తెలియక పోవడంతో వారితో కొన్నాళ్లపాటు గడిపానని వెల్లడించారు.

ఎలుక మాంసం కూడా టేస్ట్ చేశా

ఎలుక మాంసం కూడా టేస్ట్ చేశా

గిరిజన స్త్రీలతో కలిసి ఉన్న రోజుల్లో పాము కరిస్తే ఎలాంటి చికిత్స చేస్తారు? ఆ సమయంలో ఎలాంటి ఆకులు ఉపయోగించి ఔషధాలు తయారు చేస్తారు? అనే విషయాలు కూడా నేర్చుకున్నాను అని వెల్లడించింది.. అలాగే ఎలుకలు పట్టడానికి వెళ్లి వారు ఎలా పడుతున్నారు ట్రైనింగ్ కూడా తీసుకున్నానని ఒకసారి అయితే ఎలుక మాంసం కూడా టేస్ట్ చేశానని ఆమె వెల్లడించింది.

Recommended Video

అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
వివాదాల్లో చిక్కుకుంది

వివాదాల్లో చిక్కుకుంది


అయితే జై భీమ్ సినిమా మాత్రం వివాదాల్లో చిక్కుకుంది.. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సూర్య ఈ సినిమా తీశాడు అంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్ద ఎత్తున హడావిడి చేశారు. సూర్యని కొడితే లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని కూడా ప్రకటన చేసి కలకలం రేపారు. అయితే అసలు వివాదానికి కారణమైన సీన్లో అనేక మార్పులు మాత్రం సూర్య చేశారు కానీ వివాదం మాత్రం సమసి పోవడం లేదు.

More from Filmibeat

Read more about: జై భీమ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X