Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ బ్యూటీ బీచ్ వెకేషన్: అందాల ఆరబోతతో పులకించిన ఫ్యాన్స్! (ఫోటోస్)
సముద్రం ఒడ్డున బికినీలో విహరిస్తూ ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడే బాలీవుడ్ నటి లీసా హెడెన్ ఈ వేసవి సముద్ర తీరానికే అంకితం చేసినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ కలిగిన ఆమె తన బీచ్ వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
భర్త, కుమారుడితో కలిసి థాయ్ లాండ్లో విహరిస్తున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా జేమ్స్ బాండ్ హీరోయిన్ తరహాలో ఫోజులు ఇస్తూ పోస్ట్ చేసిన ఓ పిక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఏదో ఒక రోజు బాండ్ మూవీలో...
సముద్రంలో బోటుపై విహరిస్తున్న ఫోటో పోస్ట్ చేసిన లీసా హెడెన్... ఏదో ఒక రోజు 007లా కనిపిస్తాననే నమ్మకం ఉంది అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆమె కామెంటుపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ నువ్వు ఆల్రెడీ అలానే ఉన్నావ్ అంటూ పొగడ్తలు గుప్పించారు.
కుమారుడు జాక్ లల్వానీతో
తన కుమారుడు జాక్ లల్వానీతో కలిసి లీసా హెడెన్ బీచ్ వెకేషన్లో సందడి చేశారు. జాక్ కడుపులో ఉన్నపుడు కూడా లీసా సముద్రంలో విహరిస్తూ హడావుడి చేసిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక్కడ గడపటం అంటే ఆమెకు అంత ఇష్టం మరి.
కోటీశ్వరుడైన ప్రియుడితో వివాహం
లీసా హెడెన్ వివాహం తన ప్రియుడు డినో లల్వానీతో అక్టోబర్, 2016లో జరిగింది. థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో జరిగిన వేడుకలో ఇద్దరూ ఏకమయ్యారు. డినో లల్వానీ బిట్రన్కు చెందిన సంపన్న ఫక్యామిలీకి చెందిన బిజినెస్మెన్.
సినిమాలు కలిసి రాలేదు
లీసా హెడెన్. 2010లో బాలీవుడ్లో నటిగా అడుగు పెట్టినా... చెప్పుకోదగ్గ హిట్ సినిమాలే ఆమె ఖాతాలో లేవు. 'హౌస్‌ఫుల్ 3' లీసా కెరీర్లో చేసిన పెద్ద సినిమా. అయితే నటిగా గుర్తింపు లేక పోయినా...మోడలింగ్ రంగంలో తన అందాల ఆరబోత ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
లీసా హెడెన్
లీసా హెడెన్ పుట్టింది చెన్నైలోనే. 17 జూన్, 1986లో జన్మించింది. ఆమె తండ్రి వెంకట్ ఇండియన్ కాగా, తల్లి అన్నా హెడెన్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. 2010లో సినిమాల్లోకి అడుగు పెట్టే వరకు ఆస్ట్రేలియా, అమెరికాల్లో పెరిగింది. 18 ఏళ్ల వయసులో లీసా యోగా టీచర్ అవ్వాలనుకుంది. తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె సోదరి మల్లికా హెడెన్ ఇండియాలో మోడలింగ్ రంగంలోనే ఉండటంతో 2007లో ఈ బ్యూటీ భారత్ వచ్చి ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి ప్రవేశించింది.