'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్'.. బోల్డ్ వెబ్ సిరీస్, అలాంటి పాత్రలో నటించబోతున్న హీరోయిన్!
డిజిటల్ మీడియా యుగంలో క్రమంగా వెబ్ సిరీస్ ల హవా పెరుగుతోంది. వెండి తెరపై చిత్రీకరించడానికి వీలు పడని బోల్డ్ కంటెంట్ చిత్రాల్ని వెబ్ సిరీస్ రూపంలో నిర్మిస్తున్నారు. వెబ్ సిరీస్ మార్కెట్ పరిధి కూడా క్రమంగా పెరుగుతోంది. యువతని ఆకర్షించే విధంగా శృంగార సన్నివేశాలు, కాంట్రవర్షియల్ అంశాలతో వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నారు. సన్నీలియోన్ బయోపిక్, లస్ట్ స్టోరీస్, వర్మ జీఎస్టీ లాంటి చిత్రాలన్నీ వెబ్ సిరీస్ ల రూపంలో వచ్చాయి. తాజాగా ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్ సిరీస్ రాబోతోంది.

అలాంటి పాత్రల్లో
స్నేహితురాళ్లయిన నలుగురు మహిళలు ఎలా హోమో సెక్సువల్స్ గా మారారు అనే అంశంతో ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. సయామీ గుప్త, కృతి కుల్హరి, బాణి జె, మాన్వి స్నేహితురాళ్లుగా నటిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ గురించి ఆసక్తికమైన వవిషయం బయటకు వచ్చింది. ఈ సిరీస్ లో బాలీవుడ్ బ్యూటీ లిసా రాయ్ కూడా నటిస్తోందట. 46 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ సంచలన పాత్రలో నటించబోతోంది వార్తలు వస్తున్నాయి.

బోల్డ్ రోల్స్‌తో సంచలనం
హోమో సెక్సువల్ గా ఈ చిత్రంలో లిసా రాయ్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పాత్రల్లో నటించడం లిసా రాయ్ కు కొత్తేమి కాదు. దాదాపు దశాబ్దం క్రితమే లిసా రాయ్ ఇలాంటి బోల్డ్ రోల్స్ లో నటించింది. లిసా రాయ్ 2008లో ఐ కాంట్ థింక్ స్ట్రైట్ అనే చిత్రంలో లెస్బియన్ తరహా పాత్రలో నటించింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా శీతల్ శేత్ నటించడం విశేషం. తనపైన వచ్చిన ఏ విమర్శని లిసా రాయ్ పట్టించుకోలేదు.

ఎక్కువవుతున్న వెబ్ సిరీస్‌లు
వెండి తెరపై ఇలాంటి బోల్డ్ చిత్రాలు రూపొందించాలంటే సెన్సార్ అడ్డంకులు ఉన్నాయి. ఇలాంటి అడ్డంకులు లేకుండా దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్ ల పేరుతో ఆ తరహా చిత్రాలు రూపొందిస్తున్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన లస్ట్ స్టోరీస్, సన్నిలియోన్ బయోపిక్, వర్మ జీఎస్టీ చిత్రాలని చెప్పవచు. లస్ట్ స్టోరీస్, వర్మ జీఎస్టీ చిత్రాలు తీవ్ర వివాదాన్ని సృష్టించాయి.

జనవరి 25న
ఇక ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలయింది. ఇందులో శృంగార భరిత సన్నివేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ వృత్తులలో కొనసాగే నలుగురు మహిళా స్నేహితురాళ్ళు ఎలాంటి శృంగారపరమైన కోరికలు కలిగి ఉంటారు అనే బోల్డ్ కంటెంట్ తో ఈవెబ్ సిరీస్ ని రూపొందించారు. అను మీనన్ ఈ వెబ్ సిరీస్ కు దర్శత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ని జనవరి 25న టెలికాస్ట్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











