నా రొమాంటిక్ సీన్లు.. అవి చూసి అమ్మనాన్న రియాక్షన్.. లిటిల్ హార్ట్స్ హీరోయిన్
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ శివానీ నాగారం షైన్ అవుతున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ సరసన అంబాజీపేట మర్యారేజీ బ్యాండ్ చిత్రంలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి చిత్రంతోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు అందుకుంది.
ఈ క్రమంలో తాజాగా రొమాంటిక్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 90s మిడిల్ క్లాస్ సిరీస్ ఫేమ్ మౌలి తనుజ్ సరసన శివానీ అద్భుతంగా నటించింది. తెలంగాణ యాస, భాషతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటూ వస్తోంది. ఇదిలా ఉంటే.. శివానీ నాగారం ఇటీవల తన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన చిత్రాల్లో రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ గా స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రంలో రొమాంటిక్ సీన్ చేయడం కాస్తా చర్చగా మారింది. అయితే ఆ సీన్ ను నాకు సెట్ లో వివరించినప్పుడు అమ్మో నేను చేయనండి అని చెప్పాను. నాకు సౌకర్యవంతంగా లేదని చెప్పాను. నేను అస్సలు చేయలేనని అన్నాను. ఇక అలాంటి సీన్లు చేయడం నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. అన్నింటికంటే మించి నేను ఇబ్బంది పడితే కెమెరాలో దొరికిపోతాను. అది నాకు ఇష్టం లేక రొమాంటిక్ సీన్లలో చేయనని చెప్పాను.
ఆ సీన్ వరకు వదిలేయొచ్చు కదా అని అడిగాను. ఇక ఆ తర్వాత వెరీ డీసెంట్, హెల్తీ లైన్ వరకు, హద్దులు మించకుండా నటించాం. ఎలాంటి బౌండరీస్ ను మాత్రం క్రాస్ చేయలేదు. కానీ ప్రేక్షకులు ఆ సీన్ ను కూడా థియేటర్లలో బాగా అరిచారు. ఇక మా ఇంట్లో ఎక్కడా, ఎవరు ఏమనలేదు. నేనన్న కొంచెం పాతకాలం మనిషిలా ఆలోచిస్తాను. కానీ మా పేరెంట్స్ మాత్రం వెరీ ప్రాక్టికల్ గా ఉంటారు. ఇది సినిమా, నీ జాబ్ నువ్వు చేస్తున్నావ్ కదా అని అన్నారు.. అంటూ శివానీ చెప్పుకొచ్చింది.
ఇక శివానీ నాగారం తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగింది. 1998 ఆగస్టు 25న జన్మించింది. 2024 నుంచి హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అంతకు ముందు సింగర్ గా పాటలు పాడింది. ఆరంభం తెలుగు చిత్రానికి ఒక పాట పాడారామె. నెక్ట్స్ హె భగవాన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా సినిమా సినిమాకు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది. చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిగా హుందాగా మెదులుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన లేటెస్ట్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రస్తుతం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. రూ.30 కోట్ల వరకు లాభాలను సాధించి పెట్టడం విశేషం.


Click it and Unblock the Notifications











