మన్మథుడి పక్కన సెట్ అయిన గోవా బ్యూటీ, సినిమాపైనే గంపెడు ఆశలు

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ కు బైబై చెప్పేసి చాలా రోజులే అయింది. అమ్మడి అందాలను మరచిపోవడానికి జనాలకు చాలా రోజులే పట్టింది. ఇక అక్కడే సెటిల్ అయిపోతుంది అనుకుంటోన్న తరుణంలో అమ్మడు మళ్లీ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కోసం ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.
బాలీవుడ్ లోనూ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో కెరీర్ పై బెంగ పెట్టుకున్న ఇలియానా, మళ్లీ టాలీవుడ్ లో ఆఫర్ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ఇక ఇక్కడ పాతుకుపోయిన యంగ్ టాలెంట్ ను తట్టుకుని నిలబడటం అమ్మడికి కాస్త కష్టంగానే అనిపిస్తోంది. అయినా పట్టువదలకుండా గట్టిగా ట్రై చేసి టాలీవుడ్ కింగ్ సరసన బంపర్ ఆఫర్ కొట్టేసింది.

lleana gets a perfect King, to star opposite Nagarjuna

ప్రస్తుతం నాగార్జున ఒక్కరే షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆయన చేస్తున్న సినిమాలపైనే అందరి దృష్టీ నిలిచింది. ఇక గోవా బ్యూటీ కూడా కింగ్ నాగ్ తో జోడికట్టేందుకు సిద్ధమవ్వడంతో నాగ్ తాజా చిత్రం అప్పుడే జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక కల్కి వంటి సినిమాలతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషమనే చెప్పాలి.

సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు నారాయణ్ దాస్- పుస్కూర్ రామ్ మోహన్ రావు- శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఆసక్తికరమైన ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X