మొదటిసారి ఆ రూట్లో కూడా సాయి పల్లవి బిజీ... త్వరలోనే మరో బిగ్ అప్డేట్!

ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళం బ్యూటీ సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుతాయని మరోసారి రుజువయింది. ఇప్పటికే సోషల్ మీడియా ప్రపంచంలో ఆమె పేరు బాలీవుడ్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా వైరల్ ఐపోతుంది ఎక్కువగా డాన్స్ పర్ఫార్మెన్స్ తోటే సినిమాలపై ఒక్కసారిగా అంచనాలను పెంచుతోంది. ప్రయోగాత్మక కథలు అయినా సరే లేదంటే కమర్షియల్ సినిమాలే అయినా సరే అందరికీ నచ్చే విధంగా ఉంటేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక గ్లామర్ బ్యూటీలు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువగా సక్సెస్ అవుతారు అనే పదానికి కూడా అమ్మడు కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి.

టాలెంట్ ఉంటే ఎవరైనా సరే ఇండస్ట్రీలో స్టార్స్ గా రానిస్తారు అని మరోసారి రుజువు చేసింది. సాయిపల్లవి మరోసారి లవ్ స్టోరీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకుంది దీంతో ఈ బ్యూటీ భవిష్యత్తులో చేయబోయే సినిమాలపై మరింత అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా రెమ్యునరేషన్ విషయంలో కూడా సాయిపల్లవి స్థాయి మరో లెవెల్ కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో అయితే భారీగా డిమాండ్ ఏర్పడింది. సాయి పల్లవి ఒప్పుకుంటే చాలు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

Love story actress Sai pallavi upcoming big project in ott world

ఇక ఆమె కోసం ప్రత్యేకంగా కథలను రెడీ చేస్తున్న దర్శకులు కూడా చాలామంది ఉన్నారు. సాయి పల్లవికి నచ్చితే ఎంత చిన్న హీరోతో అయినా సరే సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఆమెకు కంటెంట్, పాత్ర నచ్చక పోయినా కూడా అందులో ఉన్నది పెద్ద స్టార్ హీరో అయినా సరే వెంటనే నచ్చలేదని చెప్పేస్తుంది. ఇక ఇటీవల కొన్ని ఉదాహరణలతో ఆమె ఎంత కమిట్మెంట్ తో ఉంటుందో మరోసారి అర్థమైంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల సాయిపల్లవి వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎవ్వరూ చేయని ఒక ప్రయోగాత్మకమైన కంటెంట్ తో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.. వీలైనంత త్వరగా ఆ వెబ్ కంటెంట్ కు సంబంధించిన అప్ డేట్స్ కూడా అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలియజేసింది. తప్పకుండా వెబ్ సిరీస్ ప్రపంచంలో కూడా కంటెంట్ నచ్చితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సాయిపల్లవి ఇదివరకే పలుమార్లు వివరణ ఇచ్చింది. మరి ఆమె చేయబోయే మొదటి వెబ్ సిరీస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఫైనల్ గా సాయి పల్లవి ఖాతాలో మొత్తానికి లవ్ స్టోరీ సినిమాతో మరొక బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ పడింది. ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీగా కలెక్షన్స్ అందుకోనుంది. అంటే దాదాపు శేఖర్ కమ్ముల నాగచైతన్య కెరీర్లో కూడా అత్యధిక వసూళ్లను అందుకునే సినిమాగా కూడా లవ్ స్టోరీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ సినిమా మొత్తం 33 కోట్ల షేర్ వసూళ్లను అందుకోగలిగితే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు లెక్క. మరి ఎన్ని రోజులలో ఆ టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X