ప్రభాస్ ఎవరో తెలియదు.. బాహుబలి చూశా!
సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న వివాదాస్పద చితం లవ్ యాత్రి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ హీరోగా పరిచయం అవుతున్నాడు. వారిన హుస్సేన్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర విడుదల సందర్భంగా లవ్ యాత్రి టీం హైదరాబాద్ కు ప్రమోషన్స్ కోసం వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా నుంచి ప్రభాస్ గురించిన ప్రశ్న ఎదురైంది. ప్రబస్ ఎవరో తెలియదు. కానీ బాహుబలి సినిమా చూశానని తెలిపింది. వెంటనే ఈ ఆయుష్ శర్మ కల్పించుకుని వారిన ఆఫ్గనిస్తాన్ కు చెందిన యువతి. అందుకే ఆమెకు ఇక్కడి నటీనటుల గురించి పెద్దగా తెలియదు అని తెలిపాడు. తన తరుపున తాను క్షమాపణలు చెబుతుతున్నానని తెలిపాడు.

లవ్ యాత్రి చిత్రానికి మొదటగా ప్రకటించిన టైటిల్ లవ్ రాత్రి. ఈ టైటిల్ వివాదాస్పదం కావడంతో ఆ తరువాత లవ్ యాత్రిగా మార్చారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రానికి అభిరాజ్ మినవలా దర్శకుడు.


Click it and Unblock the Notifications











