ఎద అందాలతో కుర్రాళ్ళకు లూసిఫర్ బ్యూటీ ఎర.. సానియా ఆయ్యప్పన్ మరీ ఇంత ఓపెనా?
ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వారి స్థాయిని పెంచుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా సానియా అయ్యప్పన్ అనే హీరోయిన్ పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ అయితే హై రేంజ్ లో ఉండేలా చూసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన మరి కొన్ని ఫోటోలో అయితే ఏద అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి
మలయాళం ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తన రేంజ్ పెంచుకుంటున్న సానియా అయ్యప్పన్ సినిమాల కంటే బాహ్య ప్రపంచంలోనే ఘాటైన అందాలతో దర్శనమిస్తోంది. ఈ బ్యూటీ 2014లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక చిన్నప్పుడు చదువును పూర్తిగా నెగ్లెట్ చేయకుండా ఆమె అప్పుడప్పుడు మాత్రమే చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఇక మళ్లీ మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ చిన్నది 2017 నుంచి హీరోయిన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.

మొదట్లోనే అవార్డులు
మొదట 2018లో మలయాళంలో క్వీన్ అనే సినిమా ద్వారా ఈ బ్యూటీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో ఆమె నటించిన పాత్రకు గాను బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. అలాగే మలయాళం లో కూడా ఆమెకు మరికొన్ని అవార్డులు సొంతమయ్యాయి. ఆ తర్వాత సానియాకు అతి తక్కువ టైంలోనే వరుసగా ఆఫర్లు వచ్చాయి.

లూసిఫర్ సినిమాతో..
ఇక ఒక సక్సెస్ అందితే సానియా అయ్యప్పన్ కు వెంటనే నాలుగైదు సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ బాగానే ఇస్తోంది. ముఖ్యంగా మోహన్ లాల్ లూసిఫర్ సినిమాతో కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. అందులో జాన్వి అనే ఒక పాత్రలో నటించి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ గా మలయాళం లో సైమ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది.

విభిన్నమైన సినిమాలు
ఇక ఇప్పుడు కూడా ఈ బ్యూటీ మలయాళం ఇండస్ట్రీలో కూడా చాలా బిజీగా మారిపోతుంది. 2021 లో ది ప్రీస్ట్ సినిమాలో కూడా అతిధి పాత్రలో అద్భుతంగా నటించింది. అలాగే సెల్యూట్, సాటర్డే నైట్ సినిమాలలో కూడా లీడ్ పాత్రలలో నటించి మరికొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ బ్యూటీ పారితోషికం కూడా ఈ మధ్య గట్టిగానే పెంచినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.

ఫ్యాన్ పై చేయి చేసుకోవడంతో..
ఆమధ్య సాటర్డే నైట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సానియా అయ్యప్పన్ చిత్ర యూనిట్ తో కలిసి ఒక షాపింగ్ మాల్ కు వెళ్ళింది. అయితే అక్కడ ఒక వ్యక్తి ఆమెపై తప్పుగా చేయి వేయడంతో ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది అంతేకాకుండా అతనిపై చేయి కూడా చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.

ఎద అందాలు హైలెట్ అయ్యేలా..
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తన గ్లామరస్ అందాలతో కూడా హాట్ టాపిక్ గా మారుతొంది. రీసెంట్ గా అమ్మడు ఒక పార్టీ డ్రెస్ లో షాక్ అయ్యే విధంగా కనిపించింది. ఎద అందాలతో ఘాటైన బ్యూటీలకు పోటీ గట్టిగానే ఇచ్చింది అని చెప్పవచ్చు. గతంలో చాలాసార్లు గ్లామరస్ డ్రెస్ లో కనిపించిన సానియా ఈ రేంజ్ లో మాత్రం షాక్ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ పాజిటివ్ స్పందిస్తున్నారు. మరి ఈ అందంతో ఈ బ్యూటీ ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











