Lucky Baskhar : లక్కీ భాస్కర్ బ్యూటీ మానస చౌదరి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? ఆ ఇంటి పేరే ఓ సెన్షేషన్!
కొన్ని ఇండస్ట్రీలు కొత్త కొత్త నటీనటుల్ని సర్ప్రైజింగ్‌గా అందిస్తూ ఉంటాయి. ఆయా నటీనటులు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలోనే ఉన్నా సరైన గుర్తింపు దక్కదు. కానీ ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోతారు. అలా ఈ మధ్య కొందరు హీరోయిన్స్ సినిమాలు రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయా సినిమాల సక్సెస్‌తో దర్శక నిర్మాతలు వారి ఇంటి ముందు క్యూ కడుతున్నారు. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్‌లో నటించిన ఓ అమ్మాయి హాట్ టాపిక్‌గా మారారు. ఈ వివరాల్లోకి వెళితే ..
ఇలాంటి లిస్ట్‌లో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి వంటి వారు కూడా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జోయాగా అద్భుతంగా నటించారు తృప్తి. కానీ అంతకంటే ముందు నుంచే ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు. ఏళ్ల పాటు ఎదురుచూసినా రాని బ్రేక్ యానిమల్‌తో వచ్చింది. కొద్దిరోజుల క్రితం తెలుగులో వచ్చిన థ్రిల్లర్ మూవీ "మంగళవారం" లో దివ్య పిళ్ళై అనే నటి కోసం కూడా ఇలాగే చర్చ జరిగింది. రీసెంట్ బ్లాక్‌బస్టర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన భారీ చిత్రం "దేవర" లో ఎన్టీఆర్‌కి జోడిగా కనిపించిన శృతి మరాఠే గురించి కూడా ప్రేక్షకులు ఇలాగే సెర్చ్ చేశారు.

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైంది . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో చిన్న రోల్ పోషించిన మానస చౌదరి తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. దీంతో ఆమె గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు. ఆమె ఎవరు? ఇంతకుముందు ఏదైనా సినిమాల్లో నటించిందా? ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి? అంటూ సెర్చ్ చేస్తున్నారు. 2 ఆగస్ట్ 2000వ సంవత్సరంలో మానస చౌదరి చిత్తూరు జిల్లా పుత్తూరులో పుట్టారు. తండ్రి వ్యాపార రీత్యా వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఈమెకు ఓ సోదరుడు చేతన్ చౌదరి ఉన్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ నటన వైపు మొగ్గు చూపారు.

చదువు పూర్తయ్యాక మోడలింగ్ వైపు వెళ్తానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు కూడా వెన్ను తట్టడంతో మానస చౌదరి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్‌కు తన ప్రొఫైల్ పంపించడంతో బబుల్‌గమ్ అనే మూవీలో మానస చౌదరికి హీరోయిన్‌గా అవకాశం దక్కింది. స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ సినిమా ద్వారానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ముస్తఫా ముస్తాఫా అనే సినిమాలో మానస నటించారు.
ఈ క్రమంలోనే లక్కీ భాస్కర్‌లో మానస ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండటంతో మానస చౌదరి త్వరలోనే బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరు చెరుకూరి మానస చౌదరి. ఈ ఇంటి పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదూ. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, దివంగత రామోజీరావు ఇంటి పేరు కూడా చెరుకూరి కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











