టాప్ గేర్‌లో రష్మిక మందన్న కెరీర్.. రూట్ మార్చిన నేషనల్ క్రష్!
సినీ పరిశ్రమల్లో పలు సెంటిమెంట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాగా ఇలాంటి సెంటిమెంట్స్ తెలుగు సినిమా దగ్గర కూడా ఒకింత ఎక్కువే అని చెప్పవచ్చు. ఇలా తెలుగులో కూడా ప్రతీ చిన్న అంశంలో సెంటిమెంట్స్ ఫాలో అవుతూ హిట్ అయ్యిన సినిమాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. కాగా టాలీవుడ్ లో సినిమా టైటిల్ నుంచి సినిమా హీరోయిన్ వరకు కూడా పలు సెంటిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి.
ఒక హీరోయిన్ తో సినిమా చేస్తే ప్లాప్ తప్ప మరొకటి మిగలదు అని అలాగే ఇంకో హీరోయిన్ తో సినిమా చేస్తే ఆమె లక్ తో సినిమాలు హిట్ అవుతాయి అనే నమ్మకాలు మన దగ్గర కనిపిస్తాయి. ఇలా లక్కీ హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ పూజా హెగ్డే, సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ ని ఆడియెన్స్ చూసారు. అయితే వీరికి కూడా పలు ప్లాప్ లు పడ్డాయి.

మెయిన్ గా పూజా హెగ్డేకి గోల్డెన్ లెగ్ ట్యాగ్ నుంచి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా వచ్చేలా పరిస్థితులు మారిపోయాయి. కానీ వీరికి మించి సెన్సేషన్ సెట్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అనే చెప్పి తీరాలి. తెలుగులో వరుస హిట్స్ తో లక్కీ హీరోయిన్ గా తాను మారిపోగా ఆమెతో చేస్తే ఆ సినిమా హిట్ అనే ముద్ర పడింది.
ఒకటి రెండు సినిమాలు మినహా తెలుగులో రష్మిక ట్రాక్ రికార్డు బలంగా కనిపిస్తుంది. ఇదే ఆమెకి హిందీలో కూడా పలు భారీ సినిమాలు చేసే ఛాన్స్ ఇచ్చింది. మరి అక్కడ కూడా ఆమె చేసిన సినిమాలు ఒకదాన్ని మించి ఒక హిట్ అవ్వడం మొదలయ్యాయి. అనిమల్ సినిమా నుంచి మొన్న పుష్ప 2 నేడు ఛావా వరకు హిందీ మార్కెట్ లో ఎక్కడ చూసినా రష్మిక మందన్నా బ్రాండ్ కనిపిస్తుంది.

దీంతో ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రష్మిక మారింది అని మళ్ళీ నేషనల్ లెవెల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు వరకు అంతా బాగానే ఉంది తన మార్కెట్ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. కానీ రష్మిక మిగతా టాప్ హీరోయిన్స్ లా రూటు మారుస్తుందా లేదా అనేది చూడాలి.
చాలా మంది స్టార్ హీరోయిన్స్ వారికి వరుస హిట్స్ వచ్చిన సమయంలోనే సోలో సినిమాలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. మరి ఇలా కేవలం రష్మికపై కూడా సోలో సినిమాలు ఏమన్నా పడతాయా లేదా అనేది ఇపుడు చూడాలి. ఆమెకి నేషనల్ వైడ్ మంచి ఫేమ్ వచ్చేసింది. మరి ఫ్యూచర్ లో తన నుంచి ఈ తరహా సినిమాలు కూడా వస్తాయా లేక కేవలం హీరోయిన్ గానే కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం తాను నటించిన ఛావా సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.


Click it and Unblock the Notifications











