Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
హీరోయిన్ అనుష్క కొత్త బాయ్ ఫ్రెండా? వైరల్ అవుతున్న ఫోటోస్... అసలు నిజం ఇదే!
తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్స్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో హీరోయిన్ అనుష్క ఒకరు. గతంలో అనుష్క-ప్రభాస్ పెళ్లి అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది. కేవలం ప్రభాస్ మాత్రమే కాదు.. గతంలో చాలా మంది యాక్టర్లతో అనుష్క ప్రేమాయణం సాగించినట్లు పుకార్లు షికార్లు చేశాయి.
Recommended Video
తాజాగా అనుష్క విషయంలో మరో రూమర్ హాట్ టాపిక్ అయింది. తన తర్వాతి సినిమా కోసం స్లిమ్ లుక్‌లోకి మారిన అనుష్క కొత్త ఫోటోలు విడుదల చేసింది. అయితే అందులో అనుష్క పక్కనే ఒక కొత్త వ్యక్తి, ఎవరికీ పరిచయం లేని విదేశీయుడు ఉండటంతో... అతడు అనుష్క బాయ్ ఫ్రెండ్ అనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
అతడు అనుష్క బాయ్ ఫ్రెండ్ కాదు
అనుష్క పక్కన ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తి ఆమె బాయ్ ఫ్రెండ్ కాదని తేలిపోయింది. అతడి పేరు లుకె కౌంటినో... ఆస్ట్రియాకు చెందిన న్యూట్రీషియనిస్ట్. అతడితో అనుష్కకు ఎలాంటి పర్సనల్ రిలేషన్ లేదని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
అవార్డ్ విన్నింగ్ ఎక్స్పర్ట్
లుకె కౌంటినో అవార్డ్ విన్నింగ్ న్యూట్రీషియనిస్ట్. అనుష్క బరువు తగ్గడానికి అతడి వద్దే ట్రైనింగ్ తీసుకుంది. ఇటీవల లుకె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుష్కతో దిగిన ఫోటోలు షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
ఆ కామెంట్ కూడా ఈ రూమర్లకు కారణం
లుకె కౌంటినో తను షేర్ చేసిన పోస్టులో అనుష్కపై స్టన్నింగ్, బ్యూటిఫుల్, డౌన్ టు ఎర్త్, హంబుల్, స్వీట్ అంటూ పొగడ్తలు గుప్పించడం... ఆరోగ్యమైన లైఫ్ స్టైల్, హెల్త్ విషయంలో తామిద్దరం కలిసి ఒక కొత్త విజన్‌తో ముందుకు వెళుతున్నామని, అందుకు మీ సపోర్ట్, ప్రేమ కావాలి అంటూ వ్యాఖ్యానించడం కూడా ఈ రూమర్లకు కారణమైంది.
అనుష్క శెట్టి
అనుష్క శెట్టి సినిమాల విషయానికొస్తే... త్వరలో ఆమె ‘సైలెంట్' అనే చిత్రంలో నటించబోతోంది. ఈ చిత్రంలో తమిళ స్టార్ మాధవన్ కూడా నటించబోతున్నారు. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.