అనసూయకు షాకిచ్చిన సనారే: ఏకంగా అందరి ముందే ఆమెనలా టచ్ చేసి.. వెంటనే కాళ్లు పట్టుకున్న యాంకర్!
బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో తెలుగందం అనసూయ భరద్వాజ్ ఒకరు. జబర్ధస్త్ అనే షో ద్వారా ఫేమస్ అయిన ఈమె.. తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకుంటోంది. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో షోలలో పని చేసిన ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మెరుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవగా.. ఓ పదహారేళ్ల కుర్రాడు అనసూయకు భారీ షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్‌గా కెరీర్.. ఎన్నో షోలలో అదుర్స్
కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది అనసూయ. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్‌లోకి యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం మారిపోయింది. తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లను అందుకుంది. తద్వారా బుల్లితెరపై వరుస షోలలో చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

సినీ కెరీర్ కూడా చక్కగా... రంగమ్మత్తగా
సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో షోలలో చేసి బుల్లితెరపై సత్తా చాటింది అనసూయ. అదే సమయంలో 'సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనతో ఆకట్టుకుంది. అన్నింటిలో రంగమ్మత్త పాత్రకు ఎన్నో అవార్డులు వచ్చాయి. తద్వారా సినిమా ఆఫర్లనూ అందుకుంటోంది.

అనసూయ ఫుల్ బిజీ.. పవన్ ఓ స్పెషల్
ప్రస్తుతం అనసూయ చేతి నిండా ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ', సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ', 'థ్యాంక్యూ బ్రదర్' సినిమాల్లో నటిస్తోంది. అలాగే, పవన్ - క్రిష్ సినిమాలోనూ కీలక పాత్రను పోషిస్తోంది. వీటితో పాటు 'చావు కబురు చల్లగా' అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసేసిందీ బ్యూటీ.

రచ్చ చేస్తున్న అనసూయ స్పెషల్ సాంగ్
కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ఇందులో అనసూయ చేసిన 'పైన పటారం.. లోన లొటారం' అనే స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాను కుదిపేసిన విషయం తెలిసిందే.

ఐటం సాంగ్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్
ఇటీవల ఓ నెటిజన్ ఈ పాటను షేర్ చేస్తూ.. 'ఐటం సాంగ్స్ చేయను అన్నారు కదా.. మరి ఇది ఏంటి? అయినా ఆ లిరిక్స్ ఏంటండి' అంటూ అనసూయను ప్రశ్నించాడు. దీనికి 'హలో.. అది 'ఐటమ్' సాంగ్ కాదు.. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసేవాళ్లు ఇచ్చిన పేరు అది. ఇంకో విషయం, ఆ లిరిక్స్ వల్లే నేను ఈ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను' అంటూ కౌంటర్ ఇచ్చిందామె.

అనసూయకు షాకిచ్చిన లిరిసిస్టు సనారే
మంగళవారం సాయంత్రం 'చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చిత్ర యూనిట్‌తో పాటు అనసూయ కూడా దీనికి హాజరైంది. ఈ సందర్భంగా 'పైన పటారం.. లోన లొటారం' అనే స్పెషల్ సాంగ్‌ను రాసిన సనారే (సత్యనారాయణ రెడ్డి) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దీనికి కారణం అతడి వయసు పదహారేళ్లే కావడమే. ఇక, ఈ ఈవెంట్‌లో అనసూయకు అతడు షాకిచ్చాడు.

అందరి ముందే ఆమెనలా టచ్ చేయడంతో
సనారేను మాట్లాడమని యాంకర్ సుమ కోరగానే.. అతడు నేరుగా వెళ్లి అనసూయ కాళ్లకు దండం పెట్టాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాకైపోయారు. అప్పుడు అతడు స్పందిస్తూ.. 'నేను దండం పెట్టింది వాళ్ల ఏజ్ చూసి కాదు.. అనుభవం చూసి' అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత సుమ.. 'అంటే అనసూయ ఆంటీనా' అంది. ఆ వెంటనే అనసూయ వెళ్లి సుమ కాళ్లకు నమస్కరించింది.


Click it and Unblock the Notifications











