Maa Inti Bangaram: రజినీ మూవీతో ‘మా ఇంటి బంగారం'కి లింక్? సమంత సినిమాలో భారీ ట్విస్ట్!

Maa Inti Bangaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం'. ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ కాంబోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇది సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతుండటంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మా ఇంటి బంగారం సినిమాకు రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీతో లింక్ ఉందట. ఆ సినిమా ఏంటీ? ఇంతకీ ఆ లింక్ ఏంటీ?

స్టార్ హీరోయిన్ సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబో సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే గౌతమి, శ్రీముఖి, లక్ష్మి, ఆనంద్, మంజూష తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో 'ఓ బేబీ'తో హిట్ కొట్టిన సమంత-నందినీ రెడ్డి కాంబినేషన్ లో ఇప్పుడు 'మా ఇంటి బంగారం'తో మరోసారి మ్యాజిక్ చేయబోతుందా అన్న ఆసక్తి నెలకొంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే తాజాగా దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన ఓ విషయం ఆ సినిమాను మరింత హాట్ టాపిక్‌ గా మార్చింది.

Maa Inti Bangaram Twist Samantha s Role Inspired by Rajinikanth s Baasha Template

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్య్వూలో దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని సమంత పాత్రను సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'బాషా' సినిమా టెంప్లేట్‌ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించినట్లు నందినీ రెడ్డి వెల్లడించారు. అయితే ఇది 'బాషా' రీమేక్ కాదని, ఆ సినిమాలో కనిపించిన "గతం దాచుకున్న వ్యక్తి" అనే కాన్సెప్ట్‌ను మహిళా కోణంలో కొత్తగా ఆవిష్కరించినట్టు తెలిపారు. బయటకు సాఫ్ట్‌గా కనిపించే ఈ పాత్రలో ఒక పవర్‌ఫుల్ షేడ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా కనిపించే ఓ మహిళ జీవితంలో దాగి ఉన్న పవర్ పుల్ ప్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటపడే పరిస్థితులు, కుటుంబం కోసం ఆమె చేసే పోరాటం చుట్టూనే కథ తిరుగుతుందట.

ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. దర్శకురాలు నందినీ రెడ్డి మొదట ఈ కథను హీరోయిన్ సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని రాశారట. అయితే అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారని సమాచారం. ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేసి సమంతకు అనుగుణంగా మళ్లీ డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత వెల్లడించగా, సాయి పల్లవి కూడా సోషల్ మీడియాలో స్పందించి, మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ట్రైలర్‌లో సమంత పాత్ర చుట్టూ సస్పెన్స్‌ను క్రియేట్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. "అసలు నేను ఎవరో మీకు తెలుసా?" అంటూ సమంత చెప్పే డైలాగ్ వెనుక భారీ బ్యాక్‌స్టోరీ దాగి ఉందనే సంకేతాలు కనిపించాయి. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఇప్పుడు 'బాషా' తరహా పవర్‌ఫుల్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ అనే సరికి ఈ సినిమాపై మరింత ఉత్కంఠ నెలకొంది. విడుదలకు ముందే ఇంత చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X