ఆరేళ్లు నరకం.. బొద్దింకలు, తేళ్లే ఆహారం..ఆ స్టార్ హీరోయిన్ ఇన్ని కష్టాలు పడిందా?
ఇప్పుడు వెండితెరపై వెలిగిపోతున్న నటీనటులను ఎవరిని కదిపినా తాము డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామనే చెబుతారు. కానీ డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్‌గా మారిన హీరో హీరోయిన్లు కూడా కొందరు ఉన్నారు. వారిలో డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల కూడా ఒకరు. మా ఊరి పొలిమేర చిత్రంతో ఈమె బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జీవితంలో ఎదుర్కొన్న పలు కష్టాలను గురించి కామాక్షి పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
1995 జూన్ 18న హైదరాబాద్‌లో జన్మించిన కామాక్షి భాస్కర్లకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరిక దీనిలో భాగంగా ఏకంగా చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మెడిసిన్ పట్టా అందుకున్నాక అపోలో హాస్పిటల్‌లో కొన్నాళ్లు డాక్టర్‌గా పనిచేసి ఆపై మోడలింగ్ వైపు వచ్చింది కామాక్షి. 2018లో మిస్ తెలంగాణగా ఎంపికై అదే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లొచ్చారు కామాక్షి. అనంతరం సినీరంగం వైపు అడుగుపెట్టి ప్రియురాలు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజైంది? ఎలా ఉంది అనేది కూడా జనాలకు తెలియదు.

అయితే సీనియర్ కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా నటించిన మా ఊరి పొలిమేరతో కామాక్షికి క్రేజ్ వచ్చింది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన కామాక్షి కెరీర్‌ను ఈ సినిమా మలుపు తిప్పింది. కోవిడ్ కారణంగా మా ఊరి పొలిమేర ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇందులో బెడ్ సీన్స్‌లో ఏమాత్రం మొహమాటం లేకుండా నటించిన కామాక్షి కుర్రాళ్లను రెచ్చగొట్టింది . ఆ సినిమాకు సీక్వెల్‌గా పొలిమేర 2లోనూ అద్భుతంగా నటించింది కామాక్షి భాస్కర్ల. ఈ సినిమాలో కేవలం హీరోయిన్‌గానే కాకుండా దర్శకత్వం, స్క్రిప్ట్ విభాగంలోనూ సేవలందించి తను మల్టీ టాలెంటెండ్ అని ప్రూవ్ చేసుకున్నారు కామాక్షి భాస్కర్ల.
పొలిమేర 2 తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన దూత, ఝాన్సీ, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ, మారేడుమిల్లి ప్రజానీకం, విరూపక్ష, ఓం భీమ్ బుష్ సినిమాలలోనూ నటించారు. అన్నీ కుదిరితే మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ కావాలనేది తన కల అని కామాక్షి పలు సందర్భాల్లో తెలియజేశారు. తండ్రి స్వయంగా సినిమాటోగ్రాఫర్ అయినా రంభ , కల్పనారాయ్ వంటి వారు బంధువులే అయినా ఏ ఒక్కరి సాయం తీసుకోకుండా తాను సొంతంగా ఎదిగారు కామాక్షి.
ఇకపోతే.. చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో తాను పడ్డ కష్టాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డాక్టర్ కామాక్షి. మొదటి నుంచి తనకు ఇల్లు- కాలేజీ తప్పించి ఏం తెలియదని , అలాంటి నేను ఎంబీబీఎస్ కల కోసం చైనాకు వెళ్లినట్లు చెప్పింది. చైనా వెళ్లాక అక్కడ ఇంగ్లీష్ మాట్లాడరని, అంతా వాళ్ల భాషలోనే మాట్లాడతారని తెలిసి మాండరీన్ నేర్చుకోవడానికి ప్రయత్నించినట్లు కామాక్షి పేర్కొంది. చైనాలో ఆరేళ్ల పాటు ఉన్న నేను.. గదిలోనే వంట చేసుకునే దాన్నని.. అయితే చైనీయులు బొద్దింకలు, తేళ్లు తింటారని తెలిసి వాటిని నేను కూడా రుచి చూసినట్లు తెలిపింది. ప్రస్తుతం డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











