Samantha Divorce :కోట్లు సంపాదించేదానికి పాకెట్ మనీ ఇచ్చారు.. పిల్లల్ని కనాలనే ఆశను చంపేశారు.. మాధవీలత సంచలనం

అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి రోజులు గడుస్తున్నా వారి విడుదలకు సంబంధించిన విశ్లేషణలు మాత్రం ఆగడం లేదు. వాళ్లు ఈ కారణంగా విడిపోయారు అని కొందరు మరో కారణంగా విడిపోయారని మరికొందరు ఇలా ఎవరికి తోచిన కారణాలు వాళ్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చాలా మంది అయిందేదో అయిపోయింది ఇకమీదట అయిన వారిని ప్రైవసీతో ఉండనిద్దామని అనుకున్నా సరే నెటిజన్లు మాత్రం వారిని వదలడం లేదు. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.

Recommended Video

Samantha పిల్లల్ని కనాలనే ఆశను చంపేశారు.. హాట్ టాపిక్ గా Madhavi Latha కామెంట్స్ | Filmibeat Telugu
సినిమాల్లో స్లో అయి

సినిమాల్లో స్లో అయి


ఈ మధ్యకాలంలో సినిమాల పరంగా మాధవీలత చాలా స్లో అయిపోయింది. పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు అయితే అడపాదడపా సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేస్తూ వస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన మాధవీలత బీజేపీ నుంచి గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనూహ్య పరిస్థితుల్లో ఆమెను దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని చిన్నా చితకా సినిమాలు చేస్తున్న పెద్ద అవకాశాలు దక్కడం లేదు. తాజాగా ఆమె పుట్టిన రోజు జరగడంతో ఆ సందర్భంగా ఫేస్బుక్ లైవ్ కి వచ్చిన ఆమె సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం మీద స్పందించింది.

సమంత చాలా మంచి అమ్మాయి

సమంత చాలా మంచి అమ్మాయి

సమంత చాలా మంచి అమ్మాయి అని కానీ వందలో 99 శాతం మంది సమంత కారణంగా విడాకులు వచ్చాయని ఆమె తప్పుగా చిత్రీకరిస్తూ బాడ్ కామెంట్స్ చేస్తున్నారని అలా చేయవద్దు అని కోరింది. ముఖ్యంగా ఆమె వేసుకున్న బట్టల గురించి విడాకుల దాకా వెళ్ళింది అని కొందరు అంటున్నారు అని అలా అనడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. సమంత చాలా మంచి అమ్మాయి అని పేర్కొన్న మాధవి లత ఆమె ప్రత్యూష ఫౌండేషన్ సహా ఎన్నో ఎన్జీవోలతో కలిసి చిన్న పిల్లలకు ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చారు. సమంత డబ్బు మనిషి కాదని సినిమాలు చేశాక వాటి ద్వారా వచ్చిన డబ్బు కూడా ఏం చేయాలో ఆమెకు తెలియదని మాధవీ లతా చెప్పుకొచ్చారు.

డబ్బు కోసం వాడుకున్నాడు

డబ్బు కోసం వాడుకున్నాడు

గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం వాడుకున్నాడని ఆ విషయం తెలిసి సమంత దూరం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత సమంతలో చాలా పరివర్తన వచ్చింది అని తనకు 30 ఏళ్ల వయసు రాగానే ఒక బిడ్డకు తల్లి కావాలనే విషయాన్ని గతంలో ప్రదీప్ యాంకర్ గా ఉన్న ఒక షోలో వెల్లడించిందని ఆమె పేర్కొంది. దానికి కారణం కూడా ఆమె వెల్లడించింది. అయితే ఆమె గర్భవతి అయితే ఆమెకు వచ్చే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అని భావించి ఆమె మనస్సు మార్చి తల్లి కావాలనే ఆమె ఆశలు చంపేశారని మాధవీ లతా ఆరోపించింది.

 ఒక్క శాతం మీకు ఉన్నా

ఒక్క శాతం మీకు ఉన్నా

కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే సమంతకు వేల రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు తెలుసా అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ఆమె ఏదైనా షాప్ ఓపెనింగ్ లోకి వెళితే ఆ ఓపెనింగులకు వచ్చే డబ్బు నేరుగా ప్రత్యూష ఫౌండేషన్ అకౌంట్ లో వేయమని చెప్పేది అని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఆమె చాలా బాధ పడుతోందని మాధవి చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ నేనేదో ఊహించి చెప్పడం లేదని పేర్కొన్న మాధవి లత సమంతకు సన్నిహితులే నాకు ఈ విషయాలు చెప్పారు అని చెప్పుకొచ్చింది. సమంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి అందరూ ఆమెను ట్రోల్ చేస్తున్నారని ఆమెకు ఉన్న మంచి మనసులో ఒక్క శాతం మీకు ఉన్నా సరే మీరు గొప్ప వాళ్ళు అవుతారని ఆమె చెప్పుకొచ్చారు.

డబ్బు సంపాదించే ఒక యంత్రంగా

డబ్బు సంపాదించే ఒక యంత్రంగా

ఆమె కేవలం డబ్బు సంపాదించే ఒక యంత్రంగా మాత్రమే సమంత పనికి వచ్చిందని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి దూరమైతే బాధగానే ఉంటుంది కానీ ఎంత బాధ అనుభవించి ఉంటే పెళ్లి చేసుకున్న వాడికి దూరం అవ్వాలని అనుకుంటుందో ఆలోచించాలని చెప్పుకొచ్చింది. ఇక ఆమె మంచి మనసుతో మళ్ళీ డబ్బు సంపాదించే అనేక మంది పిల్లలకు సహాయం చేస్తుందని మాధవీలత ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే నేరుగా ఎవరు ఆమెను కంట్రోల్ చేస్తున్నారు ఎవరు ఆమెకు పాకెట్ మనీ ఇస్తున్నారు అనే విషయాలను ప్రస్తావించకపోయినా అక్కినేని ఫ్యామిలీ అనేట్టు గానే మాధవి లత కామెంట్స్ చేసింది. చిరంజీవి రామ్ చరణ్ ఇప్పుడైనా సహాయం చేశారా అని అందరూ అడుగుతారు కానీ తండ్రుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న నాగార్జున, వెంకటేష్ చేశారా అని ఎవరు ఎందుకు అడగరు అని మాధవీ లత ప్రశ్నించింది. ప్రస్తుతం మాధవి లత కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్లనుంది అనేది సంచలనంగా మారింది. చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X