అవునురా... నీకేంటి నొప్పి? నటి మాధవి లత ఆగ్రహం!
Recommended Video

'నచ్చావులే' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన మాధవి లత... ఆ తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుని నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తెలుగు బ్యూటీ కాంటెపరరీ అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాధవి లత పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకున్నారు. అయితే దీనిపై కొందరు నెగటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఆమె ఫైర్ అయ్యారు.
అవునురా... నీకేంటి నొప్పి?
ఇటీవల బతుకమ్మ సంబరాలు శ్రీనగర్ కాలనీలో జరిగితే వెళ్లాను. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పెట్టాను. చాలా మంది నన్ను పొట్టిది, పొట్టిది అంటూ కామెంట్స్ పెట్టారు. వాళ్లకు నేను చెప్పేది ఒకటే... ‘‘అవును రా బై... నేను పొట్టిగనే ఉంటా, నేను పొట్టిగుండటం వల్ల నీకు ఎక్కడైనా నొప్పొచ్చిందా?'' అంటూ మాధవి లత ఫైర్ అయ్యారు.

మీ అమ్మ, మీ అక్క....
ఇలాంటి మాటలు అంటే నిజంగా నాకు కాలుతుంది. నేను పొట్టిగా ఉండటం వల్ల నీకేమైనా మాయరోగం వచ్చిందా? నేను పొట్టిగా ఉండటం వల్ల నీకేమైనా పోయేకాలం వచ్చిందా? ఏమీ లేదు కదా.... మీ అమ్మ, మీ అక్క అందరూ టాల్‌గానే ఉన్నారు కదా. నాకు లేనిది మీకు ఉన్నందుకు సంతోష పడండి... అని వ్యాఖ్యానించారు.

శాడిస్ట్ వేషాలు మానండి
నేను పుట్టడంతోనే పొట్టిగా పుట్టలేదు, పెరగలేదంతే...అది నా శరీరతత్వం. నేను పొట్టిగా ఉండటం వల్ల ఎవడికేదైనా నొప్పొస్తే, అది మీకు ఓ డిసీజ్ అయుంటే వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు ఓ శాడిస్టిక్ డిసీజ్ ఉందనుకుంటాను.... అని మాధవి లత మండి పడ్డారు.
గెట్ లాస్ట్
ఎదుటి వ్యక్తులు నల్లగా ఉండి, పొట్టిగా ఉండి, అందంగా లేక పోతే నీకు యాక్ అనే ఫీలింగ్ వచ్చిందంటే నీకు అదొక డిసీజ్ ఉన్నట్లే లెక్క. వెళ్లి దానికి ట్రీట్మెట్ తీస్కోండి. నా వాల్ మీదకు రావొద్దు. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై పేజ్... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











