మన హీరోలను బిగ్‌బాస్ పెట్టాలి.. నిజస్వరూపం తెలుస్తుంది.. అందరూ తొక్కేసే వాళ్లే.. మాధవీలత

మన హీరోలను బిగ్‌బాస్‌లో పెట్టాలి.. నిజస్వరూపం తెలుస్తుంది.. అందరూ తొక్కేసే వాళ్లే.. మాధవీలత

By Rajababu

టాలీవుడ్ అందాల భామ మాధవీ లత రాజకీయ వేత్తగా మారారు. బీజేపీలో ఆమె నేతగా వ్యవహారిస్తున్నారు. బీజేపీలో చేరిన నాకు డబ్బులు ఇచ్చారనే వార్తల్లో వాస్తవం లేదు అని అన్నారు. తాజాగా బిగ్‌బాస్ రియాలిటీ షోలపై జరుగుతున్న చర్చల్లో పాల్గొంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్2లోని సెలబ్రిటీ కౌశల్ గురించి తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకొన్నారు. ఆమె ఏమన్నారంటే..

కౌశల్ అంటే ఇష్టం

కౌశల్ అంటే ఇష్టం

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో నాకు కౌశల్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన చాలా ఎమోషనల్. ఇంట్లో నేను రిలేషన్స్ పెట్టుకోను. అలా పెట్టుకోవడం వల్ల నేను గేమ్ ఆడలేను కౌశల్ చెప్తాడు. ఒకసారి రిలేషన్ ఏర్పడితే మనం త్వరగా బయటపడలేదు.

Recommended Video

Madhavi Latha Comments On Nutan Naidu And Ganesh Elimination
కౌశల్ మినహాయింపు కాదు

కౌశల్ మినహాయింపు కాదు

కౌశల్‌కు సపోర్ట్ కేవలం బిగ్‌బాస్‌లో ఉన్నంత వరకే. ఎవరైనా పచ్చి అవకాశ వాదులు. స్వార్ధంగా బిహేవ్ చేస్తారు. ఎదగడానికి వారు ఎదుటివారిని తొక్కేస్తారు. అందరూ అలాంటి వారే. కౌశల్ అందుకు మినహాయింపు కాదు.

హీరోలను బిగ్‌బాస్‌లో పెట్టాలి

హీరోలను బిగ్‌బాస్‌లో పెట్టాలి

టాలీవుడ్ స్టార్ హీరోలను బిగ్‌బాస్‌లో పెట్టాలి. అప్పుడు వాళ్లు అంత వెధవలా అని ఫ్యాన్స్‌ అనుకోవడం ఖాయం. వాళ్ల నిజస్వరూపం చూసి అభిమానులు పారిపోతారు అని మాధవీలత అన్నారు.

వాళ్లకు వాళ్లే కొట్టుకొంటారు

వాళ్లకు వాళ్లే కొట్టుకొంటారు

మన స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్‌ను తీసుకెళ్లి బిగ్‌బాస్‌లో పెట్టాలి. అప్పుడు టాస్క్‌ల కోసం కొట్టుకొంటారు. కెప్టెన్ అవ్వడానికి తిట్టుకొంటారు. దాంతో వాళ్ల నిజస్వరూపం తెలుస్తుంది.

హీరోల నిజస్వరూపం తెలుస్తుంది

హీరోల నిజస్వరూపం తెలుస్తుంది

సినిమా హీరోలు కేవలం పాజిటివ్ రోల్స్‌లోనే కనిపిస్తారు. దాంతో వాస్తవంగా వారు ఏమిటో తెలియదు. అందుకే వారికి పెద్ద మొత్తంలో అభిమానులు ఏర్పడుతారు. వాళ్ల అసలు విషయం బయటపడితే ఎవరూ అభిమానించరు అని మాధవీ లత పేర్కొన్నారు.

నూతన్ ఎలిమినేషన్ అన్యాయం

నూతన్ ఎలిమినేషన్ అన్యాయం

బిగ్‌బాస్‌లో నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేయడం చాలా అన్యాయం. చాలా రోజులుగా ఇంట్లో ఉన్న అమిత్ తివారీని బయటకు పంపిస్తే ఇబ్బంది ఎదురవుతుందనే ఫీలింగ్ ఏర్పడుతుందని నూతన్ బయటకు పంపించారు. నూతన్‌కు అమిత్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అని మాధవీ లత అన్నారు.

డబ్బుల పంచడం సాధ్యమేనా

డబ్బుల పంచడం సాధ్యమేనా

నూతన్ నాయుడు, కౌశల్ ఆర్మీ డబ్బులు పంచుతున్నారనే విషయాన్ని మాధవీ లత కొట్టిపడేశారు. ఎక్కడో ఉన్న వారికి డబ్బులు పంచడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఇంట్లో గొడవల వల్లనే బిగ్‌బాస్2 పాపులర్ అయింది అని మాధవీ లత తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X