4 నెలల ప్రెగ్నెన్సీ రూమర్లు.. మాధురీ దక్షిత్ క్లారిటీ
భారతీయ సినిమా పరిశ్రమలో గత నాలుగు దశాబ్దాలుగా తన గ్లామర్, టాలెంట్‌తో ఆకట్టుకొంటూనే ఉన్నారు. పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రియాలిటీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా మారిపోయారు. అయితే ఇప్పటికీ తన డ్యాన్సులు, డ్యాన్స్ షోలతో కుర్రకారు, సినీ ప్రేక్షకుల గుండెల్లో కితకితలు పెడుతూనే ఉన్నారు. అయితే తాజాగా తాను నటించిన మా బహెన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన గురించి మీడియాలో వచ్చిన కొన్ని రూమర్లకు ఆమె సమాధానం ఇచ్చారు. ఆమె సమాధానం చెప్పిన రూమర్లు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్, షారుక్ ఖాన్ కలిసి నటించిన దేవదాస్ చిత్రం 2002 సంవత్సరంలో రిలీజైంది. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఆ పాటల్లో మాధురీ వేసిన స్టెప్పులు కూడా క్రేజీగా మారాయి. అయితే ఆ మూవీలోని దోలా రె దో రే అనే పాటలో ఐశ్వర్య, మాధురి పోటీ పడి నర్తించిన విధానం ఇప్పటికీ సినీ ప్రేక్షకుల గొప్ప అనుభూతిని కలిగిస్తూనే ఉంది. అయితే ఆ పాటలో స్టెప్పులు వేసేటప్పుడు మాధురీ దీక్షిత్ నాలుగు నెలల ప్రెగ్నెన్సీతో ఉందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మాధురీ దీక్షిత్ గురించి ఆ రూమర్ స్పందించారు.

దేవదాస్ సినిమా పాటను చిత్రీకరించేటప్పుడు తాను 4 నెలల గర్భవతిని అనే వార్తల్లో నిజం లేదు. ఆ రూమర్లన్నీ అవాస్తవాలే. ఎందుకంటే దేవదాస్ సినిమా రిలీజ్ అయిన తేదీ జూలై 12, 2002. ఆ సినిమాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మే 23, 2002లో ప్రదర్శించారు. నా పెద్ద కుమారుడు అరిన్ నేనే పుట్టింది మార్చి 17, 203 సంవత్సరం. కాబట్టి నేను గర్బవతిని కాదనేది వాస్తవం అని ఆమె సమాధానం ఇచ్చారు.
దేవదాస్ పాట షూటింగ్ ఎక్కువ శాతం రాత్రి వేళలో షూట్ చేశారు. ఆ సమయంలో నేను బిజీగా ఉన్నాను. ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. దాంతో నా శరీరం పూర్తిగా అలిసిపోయింది. ఆ పాటలో నటించడం నాకు పెద్ద సవాల్‌గా మారింది. దాంతో నేను ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ప్రయాణిక బడలిక వల్ల నాకు ఇబ్బంది ఎదురైంది అని మాధురీ చెప్పారు. ఆ కారణంగానే ఇలాంటి రూమర్లను క్రియేట్ చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు.
మాధురీ దీక్షిత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మా బహెన్. ఈ సినిమాకు సురేష్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెతోపాటు త్రిప్తి డిమ్రీ, ధర్నా దుర్గా, రవికిషన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి విక్రమ్ మల్హోత్రా, సురేష్ త్రివేణి నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు.
I was 4 Month PREGNANT when i shot #DolaReDola 🔥😳
— Manoz Kumar (@ManozTalks) May 31, 2026
The Reason Why #MadhuriDixit is still India's Biggest ACTRESS Even today .
Respect @MadhuriDixit 🙏 pic.twitter.com/wJOF7fIFMa


Click it and Unblock the Notifications


