లో దుస్తుల్లో సీన్ .. హీరోయిన్ పేచి .. సెట్‌లోంచి గెంటేసిన సలార్ నటుడు
ఇప్పుడంటే హీరో హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవడానికైనా, అవసరమైతే న్యూడ్‌గా నటించేందుకైనా వెనుకాడటం లేదు. అయితే 30 , 40 ఏళ్ల క్రితం పరిస్ధితి ఇలా ఉండేది కాదు. కట్టుబాట్లు, మొహమాటం ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో చీర కాకుండా వేరే కాస్ట్యూమ్స్ ధరించాలంటే హీరోయిన్లు ఎంతో ఇబ్బంది పడేవారు. అలాంటిది లో దుస్తుల్లో హీరో క్లోజ్‌గా ఉండే సన్నివేశంలో నటించాలంటే ఎంత కష్టమో ఊహించుకోవడం కూడా కష్టమే. ఈ విషయంలో ఓ స్టార్ హీరోయిన్ కు , దర్శకుడికి మధ్యన గొడవ జరిగి ఏకంగా సినిమానే ఆగిపోయింది. ఈ వివరాల్లోకి వెళితే..
100 ఏళ్లు చరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చారు , వెళ్లారు కానీ కొందరు మాత్రమే చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు. అలాంటి వారిలో మాధురి దీక్షిత్ కూడా ఒకరు. సినిమాలపై ఆసక్తితో కేవలం 17 ఏళ్ల చిరు ప్రాయంలోనే 1984లో అబోద్ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు మాధురి . చిన్నా చితకా పాత్రలు చేస్తూనే సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. తేజాబ్, రాం లఖాన్, పరిందా, త్రిదేవ్, కిషన్ కన్హయ్య వంటి సినిమాలతో హిందీ పరిశ్రమను ఊపేశారు మాధురి.

నటనతో పాటు డ్యాన్స్‌లోనూ దుమ్మురేపడంతో మాధురికి ఎదురులేకుండా పోయింది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో మాధురియే హీరోయిన్ కావాలని పట్టుబట్టేవారు. శ్రీదేవి, జయప్రద, హేమామాలిని వంటి దిగ్గజాల ప్రభ మసకబారుతున్న బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగారు మాధురి దీక్షిత్. 1990వ దశకం నుంచి 2000 వరకు పదేళ్ల పాటు బాలీవుడ్‌కు ఐకాన్‌తగా నిలిచారు.దిల్, సాజన్, బేటా, ఖల్ నాయక్, హం ఆప్కే హై కౌన్, రాజా వంటి సినిమాలు మాధురికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
సీనియర్ నటుడు వినోద్ ఖన్నాతో లిప్‌లాక్ సీన్‌లో నటించి ఆరోజుల్లో సంచలనం సృష్టించిన మాధురి దీక్షిత్ .. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో 70కి పైగా సినిమాల్లో నటించారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. శ్రీరామ్ అనే వైద్యుడిని పెళ్లాడి.. అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈ దంపతులకు అరిన్, ర్యాన్ అనే ఇద్దరు కుమారులు . వివాహం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె తిరిగి భారతదేశానికి చేరుకుని తన ఇమేజ్, వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు.
కాగా.. దర్శకుడు, నటుడు టిను ఆనంద్‌తో ఓ సినిమా విషయంలో గొడవపడ్డారు మాధురి దీక్షిత్. హీరోయిన్‌గా ఆమె హవా మొదలైన రోజుల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.. మాధురి జంటగా సంకట్ అనే సినిమా ప్రారంభమైంది. దీనికి టిను ఆనంద్ దర్శకుడు. అమితాబ్‌తో మాధురి తొలి సినిమా అదే కావడం విశేషం. ఈ కాంబోపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్‌ను వేగంగా చేస్తున్నారు ఆనంద్. అయితే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం అమితాబ్, మాధురిలను రౌడీలు బంధించే షాట్‌లో ఫైట్‌ని అద్భుతంగా తీశారు ఆనంద్.
తనని రక్షించే హీరో పట్ల కృతజ్ఞతా భావంతో ఆయనకు దగ్గరవ్వాలని హీరోయిన్ భావించాలన్నది సీన్. సినిమాలో కీలకమైన ఈ సీన్ కోసం మాధురిని లో దుస్తులలో కనిపించాలని కోరాడు టిను ఆనంద్. అయితే దానికి మాధురి ససేమిరా అనడంతో పాటు గొడవకు దిగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఈ సీన్ చేయడం ఇష్టం లేకపోతే సెట్ నుంచి వెళ్లిపోమని గద్దించారు ఆనంద్. ఆ మాటతో రగిలిపోయిన మాధురి .. బ్యాగ్ తీసుకుని సెట్‌ను వీడారట. ఈ దెబ్బతో సినిమా కేవలం ఐదు రోజులకే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ టిను ఆనంద్.. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్‌లో కీలకపాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications











