twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవే నాకు గుణపాఠాలు.. పెళ్లి తర్వాత దడదడలాడిస్తున్న మాధురీ దీక్షిత్

    |

    పెళ్లి తర్వాత కూడా వెండి తెరను, బుల్లి తెరను అందాల భామ మాధురి దీక్షిత్ దడదడ లాడిస్తున్నది. ఈ ఏడాది టోటల్ ఢమాల్, కళంక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుల్లితెరపై డ్యాన్స్ దీవానే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

    నా సెకండ్ ఇన్నింగ్స్‌ను నేను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో మరింత ఉత్సాహం కలుగుతున్నది. ఇప్పటికే ఈ ఏడాది రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. మరో డ్యాన్స్ షో నడుస్తున్నది. అదే సమయంలో కొన్ని సినిమా ఆఫర్లు నా ముందుకు వచ్చాయి. వాటికి సంబంధించిన స్ట్ర్కిప్టులు చదువుతున్నాను అని చెప్పారు.

    Madhuri Dixit: I learn from successes and failures

    నాకు ఫలానా సినిమాలే చేయాలనే పట్టింపులు లేవు. మంచి కథ, కథనాలు ఉంటే నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నేను నటించే చిత్రాలు బాగా ప్రమోట్ చేయాలని కోరుకొంటాను అని మాధురి దీక్షిత్ చెప్పారు.

    నా కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశాను. అవేమీ నాపై ప్రభావం చూపలేదు. ఫెయిల్యూర్స్‌ను గుణపాఠంగా భావిస్తాను. అలాగే విజయం నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు అని మాధురీ దీక్షిత్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    English summary
    After release of Total Dhamaal and Kalank this year, Madhuri Dixit will be back on TV to judge Dance Deewane show, She said, I can’t be carried away by success or be affected by failure. It’s a kind of teaching you learn from your successes as well as failures and you move on.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X