Madhuri Dixit ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే..

హిందీ చిత్ర పరిశ్రమలో 80, 90 దశకాల్లో సినీ ప్రేక్షకులను, కుర్రకారును తన అందం, అభినయం, డ్యాన్స్ స్టెప్పులతో పిచ్చిక్కించిన మాధురీ దీక్షిత్ మరోసారి తన అభిమానులను ఆకట్టుకొనేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు వెండితెరపైన ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నారు. అయితే ఇక నుంచి ఓటీటీ వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టి ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఓటీటీ కోసం మాధురీ దీక్షిత్ నటించిన సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎక్కడ రిలీజ్ అవుతుంది అనే విషయాల్లోకి వెళితే..

ఏక్ దో తీన్.. పాటతో అమోఘమైన పాపులారిటీ

ఏక్ దో తీన్.. పాటతో అమోఘమైన పాపులారిటీ

మాధురీ దీక్షిత్ విషయానికి వస్తే 1984లో అబోధ్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత చిన్న చితక సినిమాలు చేసినా అంతగా గుర్తింపు లభించలేదు. కానీ తేజాబ్‌లో మోహిని పాత్రలో ఏక్ దో తీన్ అంటూ స్టెప్పులు వేసిన తర్వాత ఆమె కెరీర్ రామబాణంలో దూసుకెళ్లింది. ఆ తర్వాత రామ్ లఖన్, త్రిదేవ్, పరిందా, దిల్, జమై రాజా, థానేదార్, సాజన్, ఖేల్, ఖల్ నాయక్, ఫూల్, హమ్ ఆప్కే హై కౌన్, రాజా, రాజ్‌కుమార్, బడే మియా చోటే మియా, మొహబ్బత్, పుకార్, లజ్జ లాంటి చిత్రాలతో ఆకట్టుకొన్నారు.

స్టార్ హీరోయిన్‌గా ఉండగానే..

స్టార్ హీరోయిన్‌గా ఉండగానే..

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి పాపులరాటి ఉండగానే కెరీర్‌కు, నటనకు తాత్కాలికంగా పుల్‌స్టాప్ పెట్టి పెళ్లి చేసుకొన్నారు. అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీరాం నేనే వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత మాధురి దీక్షిత్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు కూడా అందజేసింది. అయితే మళ్లీ హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి అభిమానుల్లో జోష్ పెంచింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఝలక్ దిక్లా జా, డ్యాన్స్ దివానే , ఇతర షోలోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మాధురీ దీక్షిత్

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మాధురీ దీక్షిత్

బాలీవుడ్‌లో తన సెకండ్ ఎంట్రీలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో ద్వారా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ టైటిల్‌ను ఫైండింగ్ అనామిక నిర్ణయించారు. ఆ తర్వాత దాని పేరును ది ఫేమ్ గేమ్‌గా నిర్ణయించారు. ఈ సినిమా పోస్టర్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాధురీ దీక్షిత్ ఎమోషనల్‌గా ఓ లేఖ రాశారు. ఆమె ప్రపంచం ఓ మిస్టరీగా కూడుకొన్నది. ఆమె తన కథను తీసుకొని ప్రపంచం ముందుకు వస్తున్నది. అదే ది ఫేమ్ గేమ్ సిరీస్ అంటూ తన లేఖలో పేర్కొన్నారు.

ది ఫేమ్ గేమ్‌లో నటీనటులు..

ది ఫేమ్ గేమ్‌లో నటీనటులు..

ది ఫేమ్ గేమ్ వెబ్ సిరీస్‌లో మాధురీ దీక్షిత్‌తోపాటు బాలీవుడ్ నటులు సంజయ్ కుమార్, మానవ్ కౌల్, లక్షవీర్ సరన్, ముస్కాన్ జాఫ్రీ, సుహాసిని ములే తదితరులు నటించారు. ఈ చిత్రంలో అనామిక ఆనంద్ అనే సెలబ్రిటీ పాత్రలో మాధురీ దీక్షిత్ నటించారు. ఓ దశలో అదృశ్యమైన అనామిక గురించిన వాస్తవాలు, చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చే సంఘటనల నేపథ్యంగా ది ఫేమ్ గేమ్ వెబ్ సిరీస్ రూపొందింది.

నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

సినీ తార పాత్రలో మాధురీ దీక్షిత్ నటించిన ది ఫేమ్ గేమ్ వెబ్ సిరీస్‌ను కరణ్ జోహర్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 25న స్ట్రీమింగ్ కానున్నది. ఈ వెబ్ సిరీస్‌కు బిజోయ్ నంబియార్, కరిష్మా కోహ్లీ దర్శకత్వం వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X