100 రుద్రాక్షల నుంచి ఖరీదైన కోట్ల కారు వరకు.. మోనాలిసా తొలి మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహా కుంభమేళాలో సినీ రంగానికి దొరికిన ఆణిముత్యం మోనాలిసా భోంస్లే. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకొంటూ ఈ యువతి మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ట్రెండ్ కావడం ఆబ తర్వాత ఆమె సినీ రంగం ప్రముఖుల దృష్టిలో పడటంతో ఓవర్‌నైట్‌లోనే సెలబ్రిటీగా మారిపోయారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో సెలబ్రిటీగా ఖరీదైన కారులో కనిపించిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఆమె ఫోటోకు సంబంధించి, అలాగే ఆమె కారు వివరాల్లోకి వెళితే..
మోనాలిసా భోంస్లే నేపథ్యం విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్‌లో అత్యంత పేదరికంతో బాధపడే కుటుంబంలోని యువతి. కుంభమేళాలో 100 రూపాయలకు ఒకటి చొప్పున రుద్రాక్ష మాలలు అమ్ముకొని జీవనం కొనసాగించేది. ఆ మేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతుండగా ఎవరో ఒకరు క్లిక్ చేసి ఆమె ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. అమాయకమైన చిరునవ్వు, తీక్షణమైన చూపు, ఆమె అందాలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. దాంతో ఈ 16 సంవత్సరాల యువతిని కుంభమేళా ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిపోయింది.

Photo Credit (Instagram): @monalisabhosle_official
మోనాలిసా ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో బాలీవుడ్ ప్రముఖుల చూపు ఆమెపై పడింది. ఆమెను పలువురు నిర్మాత, దర్శకులు అప్రోచ్ అయ్యారు. కానీ ఆమె జాగ్రత్తగా తనకు తోచిన వారికి, తనకు భవిష్యత్‌కు ఉపయోగపడే ప్రాజెక్టులను ఎంచుకొనే ప్రయత్నంలో పడింది. ఈ క్రమంలో పలు ప్రాజెక్టులు ఆమెకు భారీ ఆఫర్‌ను ఇస్తూ సంతకాలు చేసేలా చేశాయి.
ఇటీవల మోనాలిసా ఓ మ్యూజిక్ ఆల్బమ్ సాగ్దీలో నటించి మెప్పించింది. బాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడు ఉత్కర్ష్ శర్మ ఆమె ఫోటోను చూసి తన మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించే ఆఫర్ ఇచ్చారు. అలా ఆమె తొలిసారి కెమెరా అనుభవాన్ని పొందింది. ఈ మ్యూజిక్ వీడియో జూన్ 14వ తేదీన రిలీజై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొంటున్నది. ఆమె నటనపై కూడా నెటిజన్ల ప్రశంసలు గుప్పిస్తున్నారు.
మ్యూజిక్ వీడియోలో నటించిన తర్వాత ఆమె సరోజ్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో నటించేందుకు సిద్దమైంది. సరోజ్ మిశ్రా ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందే ఈ సినిమాలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద షూటింగ్ ప్రారంభం చేసి.. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో మూవీని షూట్ చేసి కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించేందుకు మోనాలిసాకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సనోజ్ మిశ్రా సిద్దమయ్యారు. ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినందుకు గాను 21 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది. ఇక తాజాగా ఆమె ఖరీదైన కారులో ప్రయాణించడం విశేషంగా మారింది. ఆమో ప్రయాణిస్తున్న కారు విలువ 1 కోటి రూపాయలు కావడం మరింత విశేషంగా మారింది. రోజుకు పది మాలలు అమ్ముకొంటే ఈ యువతి ఏకంగా లక్ష్లలు సంపాదిస్తూ.. కోట్ల రూపాయల కారులో ప్రయాణించడం చూసి అందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











