వరుసగా రెండవ సినిమాతో ఓటీటీలోకి కీర్తి సురేష్.. బాగానే కాపాడుతోంది..
మహానటి సినిమాతో ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్న కీర్తి సురేష్ అప్పటి నుంచి కెరీర్ ని ఒక ట్రాక్ లో నడిపిస్తోంది. జయాపజయాలను లెక్క చేయకుండా ప్రయోగాత్మకమైన సినిమాలను రెడీ చేసుకుంటోంది. ఓ వైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరో వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏమిటంటే సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నపుడే లాక్ డౌన్ మొదలు కావడంతో ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సి వస్తోంది.
లాక్ డౌన్ తరువాత మొదట ఓటీటీలో రిలీజైన సినిమా పెంగ్విన్. ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అలాంటి సినిమా ఓటీటీలో రిలీజ్ అయితేనే బెటర్ అని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక కీర్తి సురేష్ నటించిన మరో మీడియం బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిస్ ఇండియా అనే సినిమాతో మొదట్లో కొంత హైప్ క్రియేట్ చేసిన కీర్తి సురేష్ ఎలాగైనా ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేసి హిట్టు కొట్టాలని అనుకుంది. కానీ వర్కౌట్ కాలేదు.

థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా లేవని తెలుసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు ఆ సినిమాను నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారు. సినిమా బడ్జెట్ ఎంత అయ్యిందో అంతే ధరకు డిజిటల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. తెలుగు నిర్మాత మహేష్ కోనేరు నిర్మించిన మిస్ ఇండియా సినిమాకు నరేంద్ర దర్శకత్వం వహించాడు. ఒక విధంగా కీర్తి సురేష్ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాకపోయినప్పటికి కూడా ఓటీటీలో మంచి ధరకు అమ్ముడుపోవడంతో ఇంకా ఆమెకు చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











