మహానటి మరో మైలురాయి.. 100 రోజులు పూర్తి చేసుకున్న చిరస్మరణీయ చిత్రం!
మహానటి చిత్రం మరో మైలురాయిని అధికమించింది. లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. యువ దర్శకుడు నాగ అశ్విన్ సావిత్రి జీవిత చరిత్రని అందంగా తెరకెక్కించాడు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించింది.
మహానటి చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రంలో చాలా మంది స్టార్స్ భాగమయ్యారు. సమంత, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో నటించారు. శివాజీ గణేశన్ పాత్రలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించాడు.

రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాగ చైతన్య ఇలా చాలా మంది ప్రముఖ నటులు ఏ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ చాలా కళాత్మకంగా సావిత్రి చిన్ననాటి నుంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ ఆయ్యాక ఆమె వ్యక్తిగత జీవితం, కెరీర్ విషయంలో ఎదురైన ఒడుదుడుకులని ఎమోషల్ గా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించాడు. మే 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి ఘనవిజయం సాధించింది.


Click it and Unblock the Notifications











