Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దిల్ రాజుతో నాకు స్పెషల్ కనెక్షన్.. మహేష్ డైరెక్టర్ అవ్వడం ఖాయం.. పూజా హెగ్డే
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా ఫంక్షన్లో పూజా హెగ్డే మాట్లాడుతూ....
దిల్ రాజుతో 25వ సినిమా కనెక్షన్
మహర్షి సినిమాలో నాకు అవకాశం కల్పించిన దిల్ రాజు, అశ్వనిదత్, పీవీపీకి థ్యాంక్స్. దిల్ రాజుతో నాకు రెండో సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా, దిల్ రాజు 25వ సినిమాలో నటించే అవకాశం నాకు దక్కింది. దిల్ రాజు 25వ సినిమా డీజే బిగ్ హిట్ అయింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను అని పూజా హెగ్డే అన్నారు.
వంశీ పైడిపల్లి తపన కలిగిన వ్యక్తి
దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా అంకింతభావం, తపన కలిగిన డైరెక్టర్. సినిమాలోని ప్రతీ సన్నివేశాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఎక్కువగా కష్టపడ్డారు. అలాగే ఈ పాత్ర కోసం నన్ను గుర్తుపెట్టుకొన్నందుకు చాలా థ్యాంక్స్. నాకు కథ చెప్పిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి అని పూజా చెప్పారు.
అల్లరి నరేష్ నిజాయితీగా
అల్లరి నరేష్, సినిమాటోగ్రాఫర్ మోహనన్ సార్, కొరియోగ్రాఫర్స్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు సినిమాకు కీలకంగా మారారు. ఎవరూ లేకపోయినా మహర్షి లేదు. అల్లరి నరేష్ తన పాత్రను నిజాయితీతో పోషించాడు. చాలా అద్భుతంగా ఉంది
మహేష్ బాబు గుడ్ లుకింగ్
ది సూపర్‌స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహేష్ గుడ్ లుకింగ్, హ్యాండమ్స్గా ఉంటాడు.. పెద్ద సూపర్ స్టార్ అని చెబుతాను. ఈ సినిమాకు స్టార్ డమ్ తీసుకొచ్చింది నువ్వే. రిషి అంటే నువ్వు.. నువ్వు అంటే రిషి. సినిమా అంటే నువ్వే. నేను అతడిని నుంచి చాలా నేర్చుకొన్నాను. ఏదో రోజు మహేష్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. మా జంట పెద్ద హిట్ అవుతుంది. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకొంటున్నాను.
దేవీ శ్రీ ప్రసాద్.. చోటీ చోటీ బాతే
దేవీ శ్రీ ప్రసాద్ గురించి చెప్పాలంటే.. చోటి చోటి బాతే పాట నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అది కాలేజ్ ఆంథమ్‌గా మారింది. ఈ సినిమా పాటలు అందర్ని ఆకట్టుకొంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్ది రోజుల్లో నేను గిటార్ పర్ఫెక్ట్గా వాయిస్తాను. పాటలు చాలా బాగుంది.