12 ఏళ్లకే సితార భారీ విరాళం.. తండ్రి బాటలోనే మహేష్ బాబు కూతురు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి తెలుగు ప్రేక్షకుల మాగ్జిమమ్ తెలిసే ఉంటుంది. ఇప్పటికే సితార ఘట్టమనేని తండ్రి నటించిన సర్కారు వారి పాట చిత్రంలో ఒక సాంగ్ ద్వారా వెండితెరపై మెరిసింది. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను పంచుకుంటూ ఉంటుంది. తన ఫ్యామిలీ వివరాలను కూడా మహేశ్ బాబు అభిమానులకు చేర వేస్తూ ఉంటుంది. కాగా సితార ఘట్టమనేని తన తండ్రి బాటలోనే పయనిస్తూ వస్తోంది. తాజాగా సితార ఘట్టమనేని చేసిన భారీ సాయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

తండ్రికి తగ్గ తనయ అనిపిస్తూ..
మహేశ్ బాబు స్టార్ హీరో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. తండ్రి కృష్ణ చూపిన బాటలో పయనిస్తూ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇక మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా తన తండ్రి మహేశ్ బాబు బాటలోనే పయనిస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా 1000 కి పైగా పిల్లలకు హార్ట్ సర్జరీలు ఫ్రీగా చేయించారు. మరో 6500 మంది పిల్లల ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు 7500 మంది పిల్లలకు వైద్య సాయం అందుతోంది.

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Donate 1 Crore to Charity

వృద్ధుల కోసం..
ఇదే సమయంలో కూతురు సితార ఘట్టమనేని కూడా తండ్రి మహేశ్ బాబు చూపిన బాటలోనే పయనిస్తుంది. 2012 జూలై 20న సితార ఘట్టమనేని మహేశ్ బాబు - నమ్రతా దంపతులకు జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 12 ఏళ్ల వయస్సు మాత్రమే. ఇంత చిన్న వయస్సులోనే సితార ఘట్టమనేని 1 కోటి రూపాయలు వృద్ధుల ఆరోగ్యం, ఆహారం, అవసరాల కోసం ఒక చారిటీకి విరాళంగా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మొదటి శాలరీని విరాళంగా..
సితార ఘట్టమనేని ప్రస్తుతం తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటోంది. ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు మోడలింగ్ లోనూ తన కెరీయర్ ను ప్రారంభించింది. ఇంటర్నెషనల్ జ్యూయెల్లరీ బ్రాండ్ PMJ జ్యూవెల్స్ యాడ్ ఫిల్మ్ లో తొలిసారిగా నటించింది. దాంతో రూ.1 కోటి రూపాయల పారితోషికం అందుకుంది. ఆ పారితోషికాన్నే చారిటీకి విరాళంగా అందించింది.

SSMB 29 అప్డేట్స్..
మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X