Meenakshi Chaudhary: జాక్ పాట్ కొట్టేసిన మీనాక్షి చౌదరీ... అంతా మహేశ్ బాబు హ్యాండ్ వల్లే!
హిట్ భామ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది కానీ... మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాకే వెలుగులోకి వచ్చింది. ఇక మహేశ్ బాబు హ్యాండ్ పడిందంటే.. ఈ భామ ఫ్యూచర్ మారిపోయింది. ఇక ఈ భామకు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టిసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు బేస్డ్ పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీనాక్షి చౌదరి.. ఇచ్చట వాహనములు నిలుపరాదు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ తర్వాత ఖిలాడి చిత్రంతో ముందుకు వచ్చింది. అయినా ఈ భామకు సరైనా హిట్ పడలేదు. ఇక అడవి శేష్ నటించిన హిట్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. అయినా ఈ భామకు అనుకున్నంత స్థాయిలో ఛాన్సులు రాలేదు. ఇక మహేశ్ బాబు గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చాక ఈ భామ ఫేట్ మారిపోయింది.

గుంటూరు కారంలో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె తప్పుకోవడంతో... మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అలా ఈ భామకు మంచి ఛాన్స్ వచ్చింది. ఇక ఈ ఛాన్సుతో ఆమె స్టార్ హీరోయిన్ క్రేజ్ కొట్టేసింది. ఇటీవల గుంటూరు కారం నుంచి మీనాక్షి చౌదరి లుక్ కూడా బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబుకు మరదలుగా నటించిందని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే...ఈ భామకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు కూడా మీనాక్షి చౌదరి పేరు జనాలకు పెద్దగా తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు ఈ భామ పేరు వినిపిస్తుంది. దీనికి కారణం.. ఎప్పుడైతే గుంటూరు కారం సినిమాలో ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయిందో అప్పటినుంచి ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదంతా మహేశ్ బాబు క్రేజ్ అంటున్నారు.

మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన అవకాశం దక్కించుకోవడం మామూలు విషయం కాదని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోని మీనాక్షి చౌదరి .. మరో జాక్ పాట్ ఆఫర్ అందుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న ఆర్సీ 16 సినిమాలోను సెకండ్ హీరోయిన్ గా ఈ భామ సెలెక్ట్ అయిందంట. దీంతో మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టిందని అంటున్నారు.
ప్రస్తుతం మీనాక్షి... కోలీవుడ్లో మూడు సినిమాలు చేస్తుండగా... టాలీవుడ్ లో రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. గుంటూరు కారం రిలీజ్ కాకముందే ఈ భామ ఇన్ని ఆఫర్లు కొట్టేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











