Meenakshi Chaudhary: ఆ హీరోయిన్‌పై మహేశ్ హ్యాండ్ పడిందంతే... భారీగా రేటు పెంచేసింది బాసూ?
ఓ సినిమా హిట్ అయితే చాలు... హిరో హీరోయిన్లు తమ పారితోషికం పెంచుతారనే విషయం తెలిసిందే. ఇక ఓ యువ హీరోయిన్... సినిమా రిలీజ్ కాకముందే.. తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది. దానికి కారణం మహేశ్ బాబు. అదేంటి అనుకుంటున్నారా.. మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి చేస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే.. ఆ మహేశ్ సినిమాలో హీరోయిన్ క్రేజ్ తో ఆమాంతం రెమ్యూనరేషన్ పెంచేసిందని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఇప్పుడు మీనాక్షి చౌదరి ఒకరు. అక్కినేని హీరో సుశాంత్ తో కలిసి ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది మీనాక్షి. ఇక ఈ సినిమాలో మీనాక్షి యాక్టింగ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత రవితేజతో కలిసి ఖిలాడి చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఇక ఆ తర్వాత అడవిశేష్ నటించిన హిట్ 2 చిత్రంలో మీనాక్షి చౌదరి ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో మీనాక్షి నటకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అడవి శేష్ తో కలిసి లిప్ లాక్ సీన్స్ లో కూడా బాగానే నటించింది. ఇప్పుడు ఈ బోల్డ్ బ్యూటీ.. మహేశ్ బాబుతో రొమాన్స్ చేస్తోంది. అది రియల్ లైఫ్ కాదండి.. రీల్ లైఫ్ లోనే. గుంటూరు కారం సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.
ఇక ఈ బ్యూటీ నటిస్తున్న గుంటూరు కారం సినిమా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే ఈ భామ తన రేటును పెంచేసింది. అయితే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు మీనాక్షి చౌదరి చేతిలో ఉన్నట్లు తెలుస్తున్నాయి. మీనాక్షి తాజాగా తన రెమ్యూనరేషన్ కోటిన్నర రూపాయలకు పెంచేసిందని తెలుస్తోంది. ఎప్పుడు అయితే మహేష్ హ్యాండ్ పడిందో ఆ తర్వాత ఆమె రేంజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ ఎఫెక్ట్ వల్లే మీనాక్షి సినిమాకు కోటిన్నర రెమ్యూనరేషన్ అడుగుతుందట.

ఒకప్పుడు చిన్న చిన్న సినిమాలు చేసుకునే మీనాక్షి చౌదరి.. ఇప్పుడు ఇలా మహేశ్ సినిమాతో ఒక్కసారిగా రేటు పెంచేసింది. ఇక ఈ భామకు అందం, అభినయంతో పాటు.. హైట్, యాక్టింగ్ అదనపు క్వాలిటీస్ అయిపోయాయి. ఇక అందరూ ఈ భామనే సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇలా మీనాక్షికి మహేష్ సినిమా బాగానే కలిసి వచ్చినట్లు ఉంది.

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే... మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక అంతకు ముందు ఇందులో పూజా హెగ్డే నటించనుందని ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి ఎంటర్ అయింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











