మహేశ్ బాబు హీరోయిన్.. ఇప్పుడు గూగుల్ కంపెనీకి బాస్.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడంతా భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కెరీర్ ప్రారంభంలోనూ మహేశ్ బాబు క్రేజీ హీరోయిన్లతో కలిసి పనిచేశారు. బాబుతో కలిసి వెండితెరపై మెరిసిన ప్రతి హీరోయిన్ స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో ముందుకు దూసుకెళ్లింది. అలా ఇండస్ట్రీలో ఫిట్ కాలేకపోయినా వాళ్లు మాత్రం ఆయా బిజినెలు సెట్ చేసుకున్నారు. పలువురు ఫారేన్ లో సెట్ అయ్యారు. అయితే మహేశ్ బాబు కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంలో నటించిన హీరోయిన్ ఏకంగా టాప్ టెక్ కంపెనీ గూగుల్ ఇండియాలో కీలకమైన పాత్ర పోషిస్తోంది.

ఆహీరోయిన్ పేరు మయూరి కాంగో. ఇమె ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది. 1995 నుంచి 2001 వరకు హిందీలో పలు చిత్రాల్లో నటించింది. 'నసీమ్' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇక తెలుగులో మాత్రం ఓకే ఒక చిత్రంలో మయూరి కాంగో నటించడం విశేషం. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మరో హీరోయిన్ నటించి మెప్పించింది. ఆ చిత్రం మరేదో కాదు. మహేశ్ బాబు, ఆయన తండ్రి దివంగత సూపర్ కృష్ణ కలిసి నటించిన 'వంశీ' చిత్రంలోనే మయూరి కీలక పాత్రలో మెరిసింది.

Mahesh Babu Heroine Mayoori Kango now boss for google india Bussiness Here is her details

బీ గోపాల్ దర్శకత్వంలో 2000లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో మహేశ్ బాబు - నమ్రతా శిరోధ్కర్ కలిసి నటించడం మరో విశేషం. ఇదే చిత్రంలో మయూరి కాంగో స్నేహ అనే పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే ఇమె కేవలం ఐదారేళ్లు మాత్రం ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపించింది. నటిగా పెద్దగా క్లిక్ కాకపోవడంతో పెళ్లి చేసుకొని ఫారేన్ కు వెళ్లి సెటిల్ అయ్యింది. అయితే అప్పుడు మహేశ్ బాబు చిత్రంలో నటించిన ఈ నటి ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ ఇండియాలో కీ పోజిషన్ లో బాధ్యతలు నిర్వహిస్తుండటం హాట్ టాపిక్ గ్గా మారింది.

ఆమె గూగుల్ ఇండియా ఇండస్ట్రీ హెడ్ - ఏజెన్సీ బిజినెస్ గా పనిచేస్తుండటం విశేషంగా మారింది. నటిగా పెద్దగా రాణించకపోయినా ఇలా టాప్ కంపెనీలో కీలకమైన బాధ్యతలను చూస్తుండటం పట్ల మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. ఇక ఈమె 2003లో ఎన్ఆర్ఐ ఆదిత్యా ధిల్లాన్ ను పెళ్లి చేసుకొని న్యూయార్క్ లోనే సెటిల్ అయ్యింది. వారికి 2011లో ఒక బాబు జన్మించాడు. ఇక మయూరి పెళ్లి తర్వాతనే బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేసి పట్టా పొందింది. ప్రస్తుతం గూగుల్ కంపెనీకి సేవలందిస్తోంది.

Mahesh Babu Heroine Mayoori Kango now boss for google india Bussiness Here is her details

వంశీ.. చిత్రం తర్వాతనే మహేశ్ బాబు, నమత్రా ఒకరికొకరు బాగా అర్థమై కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నమ్రతా ప్రస్తుతం వారి బిజినెస్ లు చూసుకుంటూ.. పిల్లలను వృద్దిలోకి తీసుకొచ్చేందుకు తగ్గిన ఏర్పాట్లు చేస్తోంది. ఇక చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరుకారం'తో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దర్శక ధీరుడు జక్కన్నతో కలిసి ఎస్ఎస్ఎంబీ29ను తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు అల్యూమిలియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరగ్గా.. సెకండ్ షెడ్యూల్ ఒడిశాలో జరుగుతోంది. ప్రియాంక చోప్రా ఈరోజు సెట్స్ లో జాయిన్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X