Bhumika Chawla: అప్పట్లో గ్లామర్ ను దాచేసి ఇప్పుడు షాక్ ఇస్తున్న భూమిక.. థైస్ అందాలతో షాకింగ్!
సినిమా ఇండస్ట్రీలో ఒక ఏడాదిలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే చిరస్థాయిగా అందరికీ గుర్తుండిపోయే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. ఇక ఎక్కువ స్థాయిలో గుర్తింపును అందుకున్న హీరోయిన్స్ భూమిక చావ్లా ఒకరు. ఆమె కేవలం రెండు మూడు సినిమాలతోనే ప్రేక్షకులకు బలమైన ముద్ర వేసుకున్నారు.
అయితే ఒకప్పుడు పెద్దగా గ్లామరస్ డోస్ పెంచకుండా సింపుల్ గా కనిపించిన భూమిక ఇప్పుడు మాత్రం ఫోటోషూట్స్ తో షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ ఒక్క సినిమాతోనే..
భూమిక అనగానే అందరికీ కూడా ఎక్కువగా ఖుషి సినిమాని గుర్తుకొస్తుంది. ఆమె కెరీర్ లో చాలా సినిమాలు ఉన్నప్పటికీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఒక్క సినిమా కూడా కెరీర్ కు సరిపోయేంత గుర్తింపును తీసుకువచ్చింది. ఆ సినిమా అప్పట్లో ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇటీవల రీ రిలీజ్ అయినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

మహేష్ బాబుతో కూడా బిగ్ హిట్
బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న భూమిక చావ్లా వచ్చిన కొత్తలోనే ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక మొదట్లో ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమా మహేష్ బాబుతో ఒక్కడు సినిమా ఆమె స్థాయిని ఒక్కసారిగా పెంచేసాయి.

రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా..
వచ్చిన ఏడాదిలోనే వరుసగా బాక్సాఫీస్ సక్సెస్ లను చూసిన భూమిక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పట్లో పెద్దగా గ్లామర్ డోస్ హై లెవెల్లో లేకుండా సింపుల్ గా కనిపిస్తూనే మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఆమె రెమ్యునరేషన్ కూడా అప్పట్లో అందరికంటే ఎక్కువ స్థాయిలోనే ఉండేది. అయితే భూమిక మాత్రం ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది.

ఇప్పుడు కూడా బిజిగానే..
ఇక భూమికకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత మళ్లీ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగే ప్రయత్నం చేస్తుంది. తన వయసుకు తగ్గ పాత్రలలో కనిపిస్తూ ఇంకా ఇండస్ట్రీలో బిజీగానే మారిపోయింది. ప్రస్తుతం కూడా బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె బిజీగానే కనిపిస్తున్నారు.

థైస్ అందాలు హైలెట్ అయ్యేలా..
అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో భూమిక చావ్లా గ్లామర్ ఫోటోలతో షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఆమె లెగ్స్ హైలెట్ అయ్యే విధంగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. అది 2016లో తీసిన ఫోటో అని ప్రత్యేకంగా క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఫాలోవర్స్ మీరు చాలా అందంగా ఉన్నారు అంట పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అప్పట్లో మాత్రం భూమిక పెద్దగా గ్లామర్ డోస్ పెంచలేదు కానీ ఇప్పుడు ఈ విధంగా ఫోటోలతో మాత్రం కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.


Click it and Unblock the Notifications











