For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Keerthy Suresh క్యారెక్టర్‌ను బయటపెట్టిన మహేష్ బాబు.. సోషల్ మీడియాలో బహిర్గతం.. ఫ్యాన్స్‌లో రచ్చ!

  |

  సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్కారు వారి పాట టీమ్ అయితే బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో మంచి కిక్ ఇచ్చింది. గత వారం నుంచి అభిమానులు సోషల్ మీడియాలో మహేష్ బాబు SVP బ్లాస్టర్ కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మహేష్ బాబు పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో అయితే అంచనాలు గట్టిగానే పెట్టుకోగా అభిమానులకు చిత్ర యూనిట్ మొత్తానికి సంతృప్తిని ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా టీజర్ రిలీజ్ చేయడంలో అభిమానులను కాస్త ఊరించే ప్రయత్నం చేస్తుంటారు.

  ఎంత వెదుకున్నా కూడా కొందరైతే అప్డేట్స్ కూడా ఇవ్వరు. వీలైనంత వరకు అంత తొందరగా రిలీజ్ చేయడానికి ఏమాత్రం ఒప్పుకోరు. వాయిదా వేయడానికి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఈ సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ సర్కార్ వారి పాట టీమ్ మాత్రం మహేష్ ఫాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఏ మాత్రం కంగారు లేకుండా సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా కూడా పర్వాలేదని సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. సర్కారు వారి పాట బ్లాస్టర్ పేరుతో నిజంగానే బ్లాక్ బస్టర్ అయ్యేలా అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు.

  Super star Mahesh babu Sarkaru vaari paata Birthday Blaster released,

  ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ మహేష్ బాబు ద్వారానే లీక్ అయింది. సినిమాలో హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఎలాంటి పాత్ర చేయబోతున్నారో అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు లాంటి అందగాడితో కీర్తి సురేష్ లాంటి అందమైన అమ్మాయి రొమాన్స్ చేస్తే ఆ డోస్ మామూలుగా ఉండదని చాలా మంచి కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకు వెంట పడే అమ్మాయిలా కనిపించనున్న కీర్తి సురేష్ క్యారెక్టర్ పేరు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటుందట.

  కీర్తి సురేష్ మహేష్ బాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మీరు కేవలం స్క్రీన్ పైన మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చాలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి. అమేజింగ్ కో-స్టార్. బ్యూటిఫుల్ పర్సన్ కూడా. మీకు ప్రతిరోజు మంచి జరగాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అని కీర్తిసురేష్ వివరణ ఇచ్చింది. అయితే అందుకు సమాధానం ఇచ్చిన మహేష్ బాబు పనిలో పనిగా సినిమాలో కీర్తి సురేష్ క్యారెక్టర్ పేర్లు కూడా డిమాండ్ చేసినట్లుగా అర్థమవుతోంది. సినిమాలో కీర్తి సురేష్ కళావతి గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు పరశురాం సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే వీలైనంత వరకు ట్రెడిషనల్ గా చూపించాలని అనుకుంటాడు కీర్తి సురేష్ లాంటి హోమ్లీ హీరోయిన్ కూడా అదే తరహాలో ప్రజెంట్ చేశాడట. ఆమె పాత్రకు తగ్గట్లు గానే సింపుల్ గా ఉండాలని చేశారని తెలుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు కళావతికి కృతజ్ఞతలు అని తెలుపడంతో అసలు క్లారిటీ వచ్చేసింది.

  English summary
  Super star Mahesh babu Sarkaru vaari paata Birthday Blaster released,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X