మహేశ్ బాబుతోనే గేమ్సా.. డైరెక్టర్ శంకర్ కూతుళ్లకు షాకిచ్చిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేశ్ బాబు కు ఇండియాలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సౌత్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన సినిమాలకు సౌత్ లో మంచి డిమాండ్ ఉంటుంది. సినిమా సినిమాకు అభిమాన బలాన్ని మహేశ్ బాబు పెంచుకుంటూ పోతున్నారు. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తూ ఉన్నారు. అయితే మహేశ్ బాబు సినిమా, కుటుంబం, వెకేషన్ తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి. దాంతో మహేశ్ బాబు వ్యక్తిత్వాన్ని ఆయన అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్, సినీ ప్రముఖులు కూడా ఎంతగానో ఇష్టపడుతారు. తాజాగా స్టార్ డైరెక్టర్ కూతురు, భైరవం హీరోయిన్ అదితి శంకర్ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
డాక్టర్ అదితి శంకర్ సినిమాల్లోకి..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురే అదితి శంకర్. ఆమె చెన్నైలోనే పుట్టి పెరిగింది. 1997లో పుట్టిన అదితి శంకర్ చిన్నప్పటి నుంచే చదువులో, నటనపై ఆసక్తి చూపిస్తూ వస్తోంది. మరోవైపు పాటలు కూడా అద్భుతంగా పాడుతుంది. డాక్టర్ కావాలనే కోరిక ఉండటంతో అదితి శంకర్ శ్రీ రామచంద్ర యూనివర్సిటీ నుంచి మెడిసిన్ డిగ్రీ పట్టాను పొందింది. డిగ్రీ పూర్తైన వెంటనే ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా నటిస్తూ తనను తను ఫ్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తొలుత 2022లో కార్తీ సరసన తమిళంలో విరుమన్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పింది. ఆ తర్వాత మా వీరన్, నెసిప్పయ్య వంటి చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ 'భైరవం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.

మహేశ్ బాబుతో సెల్ఫీకి ప్రయత్నం..
అదితి శంకర్ ప్రస్తుతం హీరోయిన్ గా రాణించాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇంతకు ముందే తనకు సింగర్ గా గని, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పని చేసింది. దాంతో తెలుగు ఆడియెన్స్ లో కాస్తా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా 'భైరవం' చిత్రంతో అలరించింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో మాట్లాడుతూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది.
ఒకసారి మహేశ్ బాబు అదితి శంకర్ ఒక రెస్టారెంట్ లో చూసిందంట. అయితే మహేశ్ బాబు ను చూడగానే వెంటనే తన చెల్లి ఐశ్వర్య శంకర్ ను వెంట పెట్టుకొని ఇద్దరికి సెల్ఫీ ఇవ్వమని మహేశ్ బాబును అడిగిందింట. తన గురించి వివరాలు చెప్పకుండానే సెల్ఫీ అడగటంతో మహేశ్ బాబు షాక్ అయ్యాడంట. కానీ మహేశ్ బాబు వారెవ్వరో గుర్తు పట్టకపోవడంతో ఇవ్వను అని చెప్పారంట. కానీ 10 నిమిషాల తర్వాత వాళ్లు ఇద్దరు శంకర్ కూతుర్లు అని తెలుసుకొని పిలిచి మరీ సెల్ఫీ దిగిందుకు అనుమతి ఇచ్చారని తెలిపింది. మళ్లీ పిలిచి స్వీట్ గా మాట్లాడారని చెప్పుకొచ్చింది.
ఎస్ శంకర్ అలా.. అదితి ప్లానింగ్ ఇలా..
టాప్ డైరెక్టర్ ఎస్ శంకర్ చివరిగా 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతకు ముందు ఇండియన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ తో రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications











