Namrata Shirodkar: 51 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని నమ్రతా.. లుక్కేశారంటే కిక్కెక్కాల్సిందే!
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె.. ఇంటి బాధ్యతలు తీసుకొని జీవితాన్ని కొనసాగిస్తోంది. సూపర్ స్టార్ భార్యాగానే కాకుండా హీరోయిన్ గానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ప్రస్తుతం 51 సంవత్సరాలు. అయినా సరే అందాలు మాత్రం అస్సలే తగ్గలేదు. మామూలుగా ఈ వయసులో ఎవరి మొహం అయినా ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కానీ నమ్రతా మాత్రం రోజురోజుకూ మరింత అందంగా తయారు అవుతోంది.
భర్త మహేష్ బాబు లాగే ఈమె కూడా స్పెషల్ డైట్ ఫాలో అవుతూ తన అందాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఎప్పుడు ఇళ్లు, పిల్లలు, బిజినెస్ లు చూసుకుంటూ.. చాలా హుషారుగా ఉండే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడూ ట్రైండీ ఔట్ ఫిట్లలో దర్శనం ఇస్తూ కుర్రకారను ఆగం చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో హాఫ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని నమ్రతా శిరోద్కర్ స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. చంకీలతో అల్లుకుని ఉన్న ఈ పార్టీ వేర్ డ్రెస్ పైకి బ్లాక్ కలర్ షూస్ ను స్టైల్ చేసింది. అలాగే గ్రే కలర్ హెయిర్ తో అదిరిపోయేలా ముస్తాబు అయింది. స్టన్నింగ్ ఫోజులు ఇస్తూ ఫొటోలు కూడా దిగింది. వీటిని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా.. కొన్ని గంటల్లోనే ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మహేష్ బాబు తో పాటు నమ్రతా ఫ్యాన్స్ ఈ ఫొటోలకు లైకులు కొడుతూ రచ్చ చేస్తున్నారు. ఫొటోలు వైరల్ అయ్యేలా షేర్లు చేస్తూ నమ్రతా అందాలను పొగుడుతున్నారు.


ఐదు పదుల వయసులోనూ నమ్రతా అందాలు ఏమాత్రం తగ్గడం లేదని.. రోజురోజుకూ వయసు పెరగాల్సింది పోయి అందాలు పెరుగుతున్నాయంటూ చాలా మంది చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఈమె భర్త మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కాగా.. యూట్యూబ్ ట్రెండింగ్ నెంబర్ వన్ గా నిలిచింది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో చిత్రం వస్తుండడంతో.. అంతా ఫుల్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











