మహేశ్ భార్య మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. నమ్రతను ఇలా ఎప్పుడూ చూసుండరు!

నమ్రత శిరోద్కర్.. ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన ఈమె.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడికి అండగా ఉంటూ.. అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఉంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా నమ్రత కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

మిస్ ఇండియా నుంచి సినిమాల్లో
నమ్రత శిరోద్కర్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి 1993లో జరిగిన అందాల పోటీల్లో 'మిస్ ఇండియా యూనివర్స్', 'మిస్ ఇండియా ఏషియా పసిపిక్' కిరీటాలను దక్కించుకుంది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో 1998 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' అనే హిందీ చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.

https telugu filmibeat com television raajeev-fires-on-manu-about-vasu-birth-day-celebrations-on-guppedantha-manasu-march-14th-2024-episo-134649 html

తెలుగులో స్టార్ హీరోలతో చేసేసి
బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న సమయంలోనే నమ్రత శిరోద్కర్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'వంశీ'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'అంజీ' అనే సినిమానూ చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.

మహేశ్‌తో ప్రేమాయణం.. పెళ్లితో
'వంశీ' మూవీ చేస్తున్నప్పుడే మహేశ్ బాబుతో ప్రేమలో పడింది నమ్రత శిరోద్కర్. ఆ తర్వాత చాలా కాలం పాటు వీళ్లిద్దరూ రహస్యంగా ప్రేమాయణం సాగించారు. అలా దాదాపు నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పేశారు. ఈ క్రమంలోనే 2005లో అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

https telugu filmibeat com television raajeev-fires-on-manu-about-vasu-birth-day-celebrations-on-guppedantha-manasu-march-14th-2024-episo-134649 html

మహేశ్‌ బాబుకు అండగా నిలిచి
నమ్రత శిరోద్కర్ వివాహం జరిగిన తర్వాత ఇంటికే పరిమితం అయింది. ఆ తర్వాత సినీ రంగంలో యాక్టివ్ అయిన ఆమె.. మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. డేట్స్, స్టోరీ డిస్కర్షన్స్, స్టైల్స్, యాడ్స్, బిజినెస్ ఇలా అన్నింటిలోనూ తన మార్క్ చూపిస్తోంది. ముఖ్యంగా మహేశ్ బాబు బ్యానర్‌పై వచ్చే చిత్రాలపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే
ఒకప్పుడు మోడల్‌గా, తర్వాత హీరోయిన్‌గా సెన్సేషనల్ అయినా.. ఈ మధ్య కాలంలో తెరపై కనిపించకున్నా.. నమ్రత మాత్రం సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ భామ.. తరచూ తన వ్యక్తిగత, మహేశ్ మూవీలకు సంబంధించిన ఎన్నో విషయంలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.

https telugu filmibeat com television raajeev-fires-on-manu-about-vasu-birth-day-celebrations-on-guppedantha-manasu-march-14th-2024-episo-134649 html

నమ్రత గ్లామర్ ఫొటోలు వైరల్
సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్లలా అందాలను ఆరబోయకున్నా.. అప్పుడప్పుడూ కొన్ని గ్లామరస్ పిక్స్‌ను నమ్రత షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె అందాలు బాగా హైలైట్ అవుతూ నెటిజన్లను కవ్విస్తున్నాయి. దీంతో నమ్రత పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X